APSRTC Opportunity for 5,000 ITI Apprentices
ఆర్టీసీలో 5 వేల మంది ఐటీఐ అప్రెంటిస్లకు అవకాశం
5,000 మంది ఐటీఐ అప్రెంటిస్ట్ నియామకానికి ఏపీఎస్ ఆర్టీసీ చర్యలు ప్రారంభించింది. ఏప్రిల్ 15కల్లా ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలోని నాలుగు జోన్లు.. కడప, నెల్లూరు, విజయనగరం, విజయవాడలకు గాను.. డీజిల్ మెకానిక్లు 3160, మోటార్ మెకానిక్లు 200, ఎలక్ట్రిషియన్లు 560, వెల్డర్లు 160, పెయింటర్లు 320, మిల్ రైట్ మెకానిక్లు 52, మెషినిస్టు 16, షీట్ మెటల్ వర్కర్లు 520, సివిల్ డ్రా మెన్లు 12 మందికి అవకాశముందని ఆ ప్రకటనలో వెల్లడించింది. అర్హత కలిగిన ఐటీఐ అభ్యర్థులు తమ దరఖాస్తులను సంస్థ వెబ్ సైట్ లో ఈ నెల 21వ తేదీలోపు సమర్పించాల్సిందిగా కోరింది. ఆయా జోన్లవారీగా ధ్రువపత్రాల పరిశీలన ఏప్రిల్ 9న నిర్వహిస్తామని, 18న ఎంపికైన అభ్యర్థుల జాబితా ప్రకటించి వారిని 15న రీజియన్ వర్క్ షాపులకు కేటాయిస్తామని తెలిపింది.
వివరాలకు....
https://www.apsrtc.ap.gov.in/Recruitments.php
వివరాలకు....
https://www.apsrtc.ap.gov.in/Recruitments.php
0 Komentar