RBI Key decisions due
to coronavirus effect
ఆర్‌బీఐ తీసుకున్న
కీలక నిర్ణయాలు
దేశ ఆర్థిక
వ్యవస్థపై కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్
ఇండియా(ఆర్‌బీఐ) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
*రెపోరేటు
75 బేసిస్ పాయింట్లు తగ్గించింది.
*అలాగే
రివర్స్ రెపోరేటును 90 పాయింట్లకు కుదించింది.
* ఈఎంఐలపై
3 నెలలు వాయిదా (మారటోరియం) వేయాలని ఫైనాన్స్ బ్యాంకింగ్
సంస్థలను ఆదేశించిన ఆర్బీఐ
* ఆర్థిక
సుస్థిరత ఉండేలా చర్యలు చేపట్టామని, ద్రవ్యోల్బణం అదుపులోనే
ఉందని ఆయన తెలిపారు.
* బ్యాంకుల
సీఆర్‌ఆర్ 100 బేసిస్ పాయింట్ల తగ్గింపు. దీంతో ప్రస్తుత
సీఆర్‌ఆర్ 3శాతానికి చేరింది.
ఏప్రిల్ మాసంలో
ప్రకటించాల్సిన పరపతి విధాన నిర్ణయాన్ని ముందుకు తీసుకొచ్చామని చెప్పారు. ఈ
నేపథ్యంలోనే మార్చి 24, 26.
27 తేదీలలో
సమావేశమైన మానిటరీ పాలసీ కమిటీ స్థూల ఆర్థిక , సూక్ష్మ ఆర్థిక
పరిస్థితులపై చర్చించిందని తెలిపారు.
ప్రస్తుత పరిస్థితులను ఆర్‌బీఐ నిశితంగా పరిశీలిస్తోందని ఆర్‌బీఐ గవర్నర్
శక్తికాంతదాస్ తెలిపారు.
0 Komentar