School assembly 4th March information
పాఠశాల అసెంబ్లీ
నేటి వార్తలు
> నెల రోజుల్లోపు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
>తెలంగాణ రాష్ట్రంలో
కరోనా(కొవిడ్ 19) వైరస్ విజృంభించకుండా అవసరమైన అన్ని చర్యలూ
తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.
> దేశం అభివృద్ధి
చెందాలంటే శాంతి, సామరస్యం, ఐకమత్యం
ఉండాలని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
> లోక్‌సభలో నిరసనల
సందర్భంగా తమ స్థానాలను వదిలి ఎదుటి పక్షం వైపు వెళితే ఈ పార్లమెంట్ సమావేశాల
వరకు సస్పెండ్ చేస్తానని పాలక, విపక్ష సభ్యులను సభాపతి ఓం
బిర్లా హెచ్చరించారు.
> ఐక్యరాజ్య సమితి
మానవహక్కుల హైకమిషనర్ మిచెల్ బాచెలెట్ సీఏఏకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో
పిటిషన్ వేశారు.
> ఇటీవల ఇటలీ నుంచి జైపూర్‌కు వచ్చిన పర్యాటకుల్లో
భార్యాభర్త లిద్దరికీ కరోనా సోకడం కలకలం సృష్టించింది.
> చైనాలో విజృంభించిన దానికంటే మరింత వేగంగా ప్రస్తుతం
కరోనా ఇతర దేశాల్లో వ్యాపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా వెల్లడించింది.
> భారత్‌లోనూ కరోనా వ్యాప్తితో ఆఖర్లో అమ్మకాలు,
మార్కెట్ మళ్లీ ముంచేసింది. మార్కెట్‌ను కరోనా కష్టాలు వీడలేదు. వరుసగా ఏడో రోజూ
నష్టాలతో ముగిసింది.
> మహిళల టీ20 ప్రపంచకప్‌లో తొలి
సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌తో భారత్ తలపడనుంది. రెండో సెమీస్‌లో దక్షిణాఫ్రికాతో
ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియా ఆడనుంది.
నేటి సుభాషితం
"వాడక పోతే ఇనుము తుప్పు పట్టినట్లే, మెదడు కూడా మొద్దు బారుతుంది కావున నిరంతరం మెదడుకు సాన పడుతూనే
ఉండాలి."
మంచి పద్యం
కొక్కొరొకోయని కోడి
మనను మేల్కొలొపును
కుకూయని కోయిల
మనల మైమరిపించును
వారెవ్వా ! నిద్రలేపిన కోడినితిని
కోయిలనే జనులమెచ్చుకుందురు
నేటి జీ.కె
ప్రశ్న: భారతదేశంలో మొగల్ సామ్రాజ్యాన్ని ఎవరు స్థాపించారు?
జ: బాబర్
తెలుసు కుందాం
సెల్‌ఫోన్‌ను చాలాసేపు ఆఫ్ చేసి
మళ్లీ ఛార్జింగ్ చేసి ఆన్ చేస్తే తేదీని తప్పులేకుండా చూపిస్తుంది. ఆఫ్ చేసినా
దాన్లో తేదీల సమాచారం ఎలా దాగుంది?
సెల్‌ను చాలాకాలం పాటు ఆఫ్ చేస్తే
దానిలోని బ్యాటరీ పూర్తిగా డిశ్చార్జి అయిపోతుంది. అప్పుడు ఫోన్ మెమొరీలో ఉండే
సమాచారం మొత్తం ఖాళీ అవుతుంది. తిరిగి ఛార్జింగ్ చేసి ఆన్ చేస్తే ఆ సమాచారం
తిరిగి రాదు. కానీ తేదీ, కాలం మాత్రం బాగానే కనిపిస్తాయి. ఇందుకు
కారణం ఫోన్ మెమొరీ కాదు. మనం ఏ కంపెనీ సెల్‌ఫోన్‌ను వాడుతున్నామో, ఆ టవర్‌తో లింకు ఏర్పడి వారి సర్వీసు సర్వర్ కంప్యూటర్‌తో
సంధానించుకుంటుంది. అయితే కాంటాక్ట్స్, ఇతర వివరాలను సెల్‌లో
ఉండే మైక్రోచిప్‌లోకానీ, సిమ్ మెమొరీలో కానీ దాచుకుంటే
ఎన్ని రోజుల తర్వాతైనా తిరిగి వాడుకోవచ్చు.
చరిత్రలో ఈ రోజు
ప్రత్యేక దినాలు
భారత జాతీయ భద్రతా దినోత్సవం.
[సమాజానికి ఒక నిర్దేశిత
సందేశం ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూ ఉంటాము. సాంప్రదాయాలు కాపాడుకోవడం కోసం
పండుగలు చేస్తాము. ఏది చేసినా ఎక్కడ చేసిన ప్రపంచ మానవాళి శ్రేయస్సు కోసమే
నిర్దేశించబడుతుంది. పుట్టినరోజు, పెళ్లిరోజు, అమ్మల రోజు, నాన్నల రోజు, ప్రేమికులరోజు
లను ఈ రోజుల్లో మనం వారి గురించి ఆలోచించి, వాళ్లను కొనియాడి,
మన బాధ్యతను గుర్తు చేసుకుం టాం. మరి మార్చి 4న
జాతీయ భద్రత దినోత్సవం గురించి కూడా మన బాధ్యతలేమిటో తెలుసుకుందాం… పని చేసే ప్రదేశంలో భద్రతను పెంపొందించడానికి ప్రతిఏటా మార్చి4న జాతీయ భద్రత దినోత్సవాలను నిర్వహిస్తారు.
మన దేశంలో ప్రతిఏటా దాదాపు లక్ష మంది వరకు
రోడ్డు ప్రమాదాల్లో మరణించడం, ఇంకొందరు తీవ్ర గా యాల పాలవుతున్నా
రు. ఈ రోడ్డు ప్రమాదాల్లో అత్యధికం మానవ తప్పిదాలవల్ల జరుగుతున్నవే. వాహనాదారులు
వాహనాన్ని అతివేగంగా నడపడం, రహాదారుల మీద నడిచేవారు చూపే
నిర్లక్షం వంటివి ఈ ప్రమాదాల్లో సృష్టిస్తున్నాయి. వీటితో పాటు పారిశ్రామిక
కర్మాగారాలలో జరిగే ప్రమాదాలు,అగ్ని ప్రమాదాలు వంటివి నిత్యం
సంభవిస్తున్నాయి. పని చేసేందుకు వెళ్లినవారు తిరిగి క్షేమంగా ఇంటికి వస్తారో…
రారో అన్న ఆందోళనతో కుటుంబ సభ్యులు బతకాల్సివస్తోంది. కుటుంబ
పెద్దకు ప్రమాదం జరిగినా, ప్రమాదంలో మరిణించినా ఇక ఆ కుటుంబం
మొత్తం కోలుకోని విధంగా దెబ్బతింటుంది. అందుకే ప్రతి ఒక్కరూ తమవంతు భద్రతను
పాటించాలి. ప్రతి కార్మికుడు తాను తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే, సూచించిన పద్దతులను పాటిస్తే ప్రమాదాలు సంభవించవు.
మార్చి 4, 1966లో జాతీయ భద్రత
మండలి రూపుదిద్దుకుంది. అదే రోజును జాతీ య భద్రత దినోత్సవంగా జరపాలని
నిర్ణయించింది. నాటి నుంచి ఈ మండలి ప్రజలకు భద్రత పట్ల అవగాహన కార్యక్రమాలను
నిర్వహిస్తుంది. ]
సంఘటనలు
✴1961: భారత మొదటి విమాన వాహక నౌక
ఐ.ఎన్.ఎస్.విక్రాంత్ పని
మొదలుపెట్టింది.
✴1974: పీపుల్స్ మేగజైన్ మొదటిసారి
ప్రచురించ బడింది.
జననాలు
❇1856: ప్రముఖ భారతీయ రచయిత్రి
తోరూదత్ జననం.
❇1886: బులుసు సాంబమూర్తి, (తూర్పు గోదావరి జిల్లా, దుళ్ల గ్రామం) దేశభక్తుడు,
స్వాతంత్ర్య సమరయోధుడు, ఈయన మద్రాసు శాసన
పరిషత్ అధ్యక్షులు. ప్రత్యేకాంధ్ర రాష్ట్రం, విశాలాంధ్ర అనే
పరమ లక్ష్యాల సాధనకు నిరంతరం కృషి చేసిన కార్యశూరుడు. (మ- 1958 ఫిబ్రవరి 2)
❇1962: బుర్రా విజయదుర్గ, ప్రముఖ రంగస్థల నటీమణి. ఈవిడ
మూడువేలకు పైగా పౌరాణిక, చారిత్రక, సాంఘిక
నాటక ప్రదర్శనలు ఇచ్చారు. వీరు చింతామణి, చంద్రమతి, బాలనాగమ్మ, లక్ష్మీ, పద్మావతి
పాత్రలలో ప్రసిద్ధులు.
❇1973: చంద్రశేఖర్ యేలేటి, తెలుగు సినిమా దర్శకుడు.
❇1980 : ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు
రోహన్ బోపన్న జననం.
❇1987 : ప్రముఖ తెలుగు సినిమా నటి శ్రద్దా
దాస్ జననం.
మరణాలు
❇1964: కిరికెర రెడ్డి భీమరావు, తెలుగు, కన్నడ భాషలలో కవిత్వమల్లినవాడు
❇2002: కె.వి.రఘునాథరెడ్డి కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి (జ.1924)
❇2016: పి.ఎ.సంగ్మా, లోక్‌సభ మాజీ స్పీకరు. మేఘాలయ
రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 1988 నుండి 1990 వరకు పనిచేసారు. (జ.1947)
❇2016: రాంరెడ్డి వెంకటరెడ్డి, ఖమ్మం జిల్లా పాలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే. (జ.1944)
0 Komentar