Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Scientific Details about Sugarcane Jaggery

Scientific Details about Sugarcane Jaggery  


చెరకు బెల్లం గురించి శాస్త్రీయ వివరాలు
చెరకు రసం: శరీరానికి చలవ చేస్తుంది. వీర్యవర్థకం, కఫకరం. కాచిన చెరకు రసం శరీరం లో వేడిని ఉత్పత్తి చేస్తుంది. కడుపులోని వాయువుని, కడుపు నొప్పిని పోగొడుతుంది. మలమూత్రాలను సాఫీగా జారీ చేస్తుంది.
గుణాలు: తియ్యగా, జిగురు  (స్నిగ్ధం) గా ఉంటుంది. వాతహరం. కొంతవరకు వేడిని తగ్గిస్తుంది, కాని శర్కరంత చలవ చేయదు. మూత్రాన్ని సాఫీగా చేసి మూత్ర వికారాలను తగ్గిస్తుంది. వృష్యం (శుక్రకరం, వీర్యవర్థకం), బలవర్థకం. దేహంలో కొవ్వును (మేదస్సు) పెంచుతుంది. కఫాన్ని, క్రిములను పెంచుతుంది.
కొత్త బెల్లం: జఠరాగ్నిని పెంచుతుంది, కాని కఫాన్ని, కృములను కలుగచేస్తుంది. దగ్గు, ఆయాసాలను పెంచుతుంది.
పాత బెల్లం: చాలా మంచిది (పథ్యం). లఘువు అంటే తేలికగా జీర్ణమై శరీరాన్ని తేలికపరుస్తుంది. వేడిని తగ్గించి కొవ్వును కరిగిస్తుంది. జఠరాగ్నిని పెంచి, పుష్టిని కలిగిస్తుంది. వృష్యం. రక్తదోషాన్ని పోగొడుతుంది. వాతరోగాల్ని తగ్గిస్తుంది.
ఔషధ గుణాలు: బెల్లాన్ని శుంఠి (శొంఠి)తో కలిపి సేవిస్తే, అన్నిరకాల వాతరోగాలు తగ్గుతాయి. అల్లంతో కలిపి సేవిస్తే కఫవ్యాధులు పోతాయి. కరక్కాయ చూర్ణంతో కలిపి సేవిస్తే, అన్ని పిత్తరోగాలు ఉపశమిస్తాయి. ఇది మూలవ్యాధి (పైల్స్‌)ని తగ్గించడానికి మంచి మందు.
మత్స్యండీ: చెరకు రసాన్ని ఒక పద్ధతిలో వేడి చేస్తూ బెల్లాన్ని తయారుచేసేటప్పుడు, చివరన కొంచెం ద్రవాంశలు మిగిలిపోతాయి. దానినే మత్స్యండీ అంటారు. ఇది బలకరం, మృదురేచకం, రక్తశోధకం, వీర్యవర్ధకం.
ఆధునిక జీవరసాయన పోషక వివరాలు:
తాటి బెల్లం, ఖర్జూర బెల్లం, కొబ్బరి బెల్లాలు కూడా తయారీలో ఉన్నప్పటికీ, ప్రస్తుతం చెరకుల్లాన్నే ఎక్కువ వాడుతున్నారు. దీనిలోని పోషకల విలువలు కూడా విశిష్టం. నూరు గ్రాముల బెల్లంలో ప్రొటీన్లు 0.4, కొవ్వులు 0.1, మినరల్స్‌ 0.6 శర్కరలు (కార్బోహ్రైడ్రేట్స్‌) 95 శాతం, కాల్షియం 80 శాతం, ఫాస్ఫరస్‌ 40 శాతం, ఐరన్‌ 2.64, కేలరీలు 383 ఉంటాయి.

తయారీలో ఆసక్తికర అంశాలు:
రిఫైన్డ్, డిస్టిలేషన్‌ చేయకుండా ఉన్నది మంచి బెల్లం. దీంట్లో కెమికల్స్‌ వాడకపోవటం వలన అన్ని పోషక ఖనిజాలు (ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్‌) భద్రంగా ఉంటాయి. మట్టిరంగు వంటి నలుపు రంగులో ఉండే బెల్లం ఉత్తమం. దీంట్లో విటమిన్లు, ఫైబర్‌ కూడా ఉంటాయి. కనుక ఆరోగ్యకరం.
ఆర్గానిక్‌ బెల్లం (జాగరీ): ఇది మరింత శ్రేష్ఠం. చెరకును పండించినపుడు కృత్రిమ రసాయనిక ఎరువులు గాని, క్రిమిసంహారక మందులు గాని వాడరు. బెల్లంలో తెలుపు లేదా ఎరుపు రంగు రావటం కోసం కెమికల్స్‌ (బేకింగ్‌ సోడా, కాల్షియం కార్బొనేట్‌/సున్నం పొడి, జింక్‌ ఫార్మాల్‌ డిహైడ్‌ సల్ఫాక్సిలేటు వంటివి) వాడరు. కనుక పసుపు మిశ్రిత మట్టిరంగులో చూర్ణం రూపంలో ఉంటుంది. సుక్రోజ్, యాంటీ ఆక్సిడెంట్స్‌ అధికంగా ఉంటాయి. పొటాషియం, జింక్, సెలీనియం వంటి ఖనిజాలు వార్థక్యాన్ని దూరం చేయటానికి ఉపకరిస్తాయి.
కల్తీ బెల్లాలు: నిగనిగలాడే ఎరుపు, తెలుపు, పసుపు రంగులు విరజిమ్మటం కోసం హానికర కెమికల్స్, తీపిని అధికం చేసే కెమికల్స్, నిల్వ ఉండటానికి కెమికల్స్‌ అధిక మోతాదులో కలుపుతారు. అసలైన మట్టిరంగు కంటె ఈ ఆకర్షిత రంగు బెల్లానికి వినియోగదారులు ఆకర్షితులవుతారు. పంచదార తయారీలో మితిమీరిన తెలుపు, తీపి మినహా పోషక విలువలు ఉండవు. బ్రౌన్‌ సుగర్‌లో బ్లీచింగ్‌ తక్కువ ఉంటుంది కాబట్టి కొంతవరకు నయం. తెల్లటి పంచదార తయారీ లో రసాయనిక పదార్థాలు అధికంగా ఉంటాయి. ఆ పంచదార ఆరోగ్యానికి చేటు చేస్తుంది కనుక జాగ్రత్తలు తీసుకోవటం మంచిది.
Previous
Next Post »

1 comment

  1. బాగుంది బ్రదర్.... బెల్లం యొక్క ఎక్స్పైరీ డేట్ ఎన్ని నెలలు తెలుపగలరు..

    బెల్లం యొక్క మంచి విషయాలు చక్కర వల్ల జరిగితే చెడు పరిణామాలు కూడా తెలిస్తే బాగుంటుంది

    ReplyDelete

Google Tags