Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

States that announce lockdown one after the other in India

మార్చి 31వ తేదీ వరకూ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ల లో లాక్ డౌన్
31 వరకు ఏపీలోనూ లాక్‌డౌన్‌
కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే ఐసోలేషన్‌ ఒక్కటే మార్గమని, ఎవరూ తిరగకుండా, ఎవరున్న చోట వారు ఉండగలిగితే దీన్ని కట్టడి చేయగలమని సీఎం జగన్‌ అన్నారు. ఇప్పటికే 12 రాష్ట్రాలు అంతర్రాష్ట్ర సరిహద్దులను మూసివేశాయని, మన రాష్ట్రం కూడా అంతర్రాష్ట్ర సరిహద్దులను మూసివేస్తున్నామని ప్రకటించారు.  ఈ నెల 31 వరకు రాష్ట్రంలోనూ లాక్‌డౌన్‌ చేయాలని నిర్ణయించామని తెలిపారు. ప్రజా రవాణాను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అత్యవసర వాహనాలకు మాత్రమే అనుమతిస్తున్నట్లు పేర్కొన్నారు. అవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని సూచించారు.

*పదో తరగతి, ఇతర పరీక్షలు యథాతథంగా నిర్వహించాలని నిర్ణయించాం.
మార్చి 31 వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మార్చి 31 వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..  కరోనా వైరస్‌ నియంత్రణకు చేపట్టిన జనతా కర్ఫ్యూకు ప్రజలంతా అద్భుతమైన రీతిలో సంఘీభావం తెలిపారని అన్నారు. సంఘీభావ ఐక్యతను చాటిచెప్పిన ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు సీఎం పేర్కొన్నారు.
ఇవాళ తెలంగాణలో 5 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని చెప్పారు. కరోనా నివారణకు ఉన్నత స్థాయి కమిటీ చర్చించిందన్నారు. ఈనెల 31 వరకు ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని.. అప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటిస్తున్నట్లు సీఎం స్పష్టం చేశారు. ఇంటి అవసరాల కోసం కావాల్సిన పాలు, కూరగాయలు కోసం మాత్రమే బయటకు రావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
దేశంలో 75 జిల్లాలు లాక్ డౌన్..కేంద్రం కీలక నిర్ణయం

దేశంలో కరోనా వైరస్ మృత్యునాదం చేస్తోన్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ ప్రభావం ఉన్న 75 జిల్లాలను మర్చి 31 వరకు లాక్ డైన్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆయా డిస్ట్రిక్ కలెక్టర్లుకు ఆదేశాలు అందాయి.  ఈ నేపథ్యంలో 75 జిల్లాలలో అత్యవసర సేవలు మినహా మిగతా సర్వీసులు పూర్తిగా బంద్ కానున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వాల సీఎస్‌లు, కేంద్ర ప్రభుత్వం కేబినెట్ కార్యదర్శి..ఇతర ముఖ్య అధికారులులో చర్చించిన అనంతరం కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.  మహమ్మారి కరోనాను కట్టడి చేయాలంటే లాక్ డౌన్ తప్ప మరో ఆప్షన్ లేదని అధికారులందరూ ఒకే అభిప్రాయాన్ని వెల్లిబుచ్చినట్టు సమాచారం. ప్రధాని జనతా కర్ఫ్యూకు ప్రజలు సహకరిస్తోన్న నేపథ్యంలో..ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ అవ్వనున్న జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, తూర్పు గోదావరి,  నెల్లూరు, ప్రకాశం, విశాఖ జిల్లాలుతెలంగాణ నుంచి  హైదరాబాద్, రంగారెడ్డి,  కరీంనగర్, ఖమ్మం జిల్లాలు ఉన్నట్లు సమాచారం.
ఇక తెలంగాణలోనూ కరోనా ఎఫెక్ట్‌ వల్ల కీలక నిర్ణయాలు తీసకునే అవకాశాలు కనిపిస్తాయి. కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతోన్న నేపథ్యంలో  మార్చి 31 వరకు రాష్ట్రాన్ని షట్ డౌన్ చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై ముఖ్యమంత్రి ఇప్పటికే అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 5 గంటలకు సీఎం ప్రెస్ మీట్‌లో దీనిపై ప్రకటన చేసే అవకాశం ఉంది.

Previous
Next Post »
0 Komentar

Google Tags