Swayam E-Learning app
భారత ప్రభుత్వానికి చెందిన ఇ-లెర్నింగ్ ప్లాట్‌ఫామ్ SWAYAM వివిధ కోర్సులు అందిస్తున్నది. విద్యార్థులు ఎప్పుడైనా ఇందులో కోర్సులు చేయొచ్చు. నచ్చింది నేర్చుకోవచ్చు. మేనేజ్‌మెంట్, న్యాయశాస్త్రం, ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ ఇలా అనేక అంశాల్లో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. 9వ తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు అందరూ ఈ డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్ ఉపయోగించుకోవచ్చు. లెర్నింగ్ మెటీరియల్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నిపుణులు అందించే సెషన్స్ కి అటెండ్ కావొచ్చు. ఆన్‌లైన్ కోర్సులు చేయొచ్చు. సర్టిఫికెట్లు కూడా పొందొచ్చు. విద్యార్థులకు కోర్సుల్ని అందించేందుకు 1,000 పైగా ఫ్యాకల్టీ మెంబర్స్ స్వయం ఇ-లెర్నింగ్ ప్లాట్‌ఫామ్ కోసం పనిచేస్తున్నారు. దేశవ్యాప్తంగా 9 అత్యున్నత విద్యా సంస్థలు స్వయం ఇ-లెర్నింగ్ ప్లాట్‌ఫామ్‌కు ఎడ్యుకేషన్ కంటెంట్ అందిస్తున్నాయి.
Swayam E-Learning app DOWNLOAD
0 Komentar