తెలంగాణలో పదో తరగతి పరీక్షలు మరలా వాయిదా
రేపట్నుంచి
ఏప్రిల్ 6 వరకు జరగాల్సిన పదో తరగతి పరీక్షలను మరోసారి వాయిదా వేస్తున్నట్టు
తెలంగాణ ఎస్‌ఎస్‌సీ బోర్డు వెల్లడించింది. కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో
హైకోర్టు ఆదేశాల మేరకు నేటి వరకు
పరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్ దృష్ట్యా అన్ని
పరక్షలను వాయిదా వేస్తున్నట్టు ఎస్‌ఎస్‌సీ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి
వెల్లడించారు. పరీక్షల తేదీలను తర్వాత వెల్లడిస్తామన్నారు.
తెలంగాణలో
పదోతరగతి పరీక్షల నిర్వహణపై హైకోర్టులో విచారణ జరిగింది. పదోతరగతి పరీక్షలన్నీ
వాయిదా వేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. దీనిపై స్పందించిన
న్యాయస్థానం పరిస్థితులు చక్కబడే వరకు పరీక్షలు వాయిదా వేయాలని ఆదేశించింది.
0 Komentar