Telangana Department of Finance, who had completed the
selection process before 01-09-2004 and subsequently given the details of
Appointment...
ఓపీఎస్‌కు
అర్హులైన సీపీఎస్ వారి వివరాలు ఇవ్వండి
సంభందిత ఉత్తర్వుల కోసం క్రింద చూడండి.
కాంట్రిబ్యూషన్
పెన్షన్ స్కీం (సీపీఎస్) ఉద్యోగుల్లో అర్హులైన వారిని ఓల్డ్ పెన్షన్
స్కీం(ఓపీఎస్)లోకి చేర్చేందుకు ప్రభుత్వం చర్యలు. ఓపీఎస్‌కు అర్హులైనప్పటికీ
సీపీఎస్ వర్తించిన ఉద్యోగుల వివరాలను అందించాలని అన్ని శాఖలను ఆయన ఆదేశించారు. 2004
సెప్టెంబరు 1వ తేదీకి ముందు ఉద్యోగాల నియామక ప్రక్రియ పూర్తై ఆ తర్వాత నియమితులైన (పోస్టింగ్
పొందిన) వారి వివరాలను ఇవ్వాలని సూచన. కేంద్రం గత నెలలో కీలకమైన ఉత్తర్వులు జారీ
చేసింది. దీని ప్రకారం 2004 సెప్టెంబరు 1వ తేదీకి ముందు ఉద్యోగాల నియామక ప్రక్రియ
పూర్తై ఆ తర్వాత నియమితులైన(పోస్టింగులు) వారిని ఓపీఎ్‌సలోకి చేర్చుతున్నట్లు ప్రకటించింది.
ఉద్యోగులకు సంబంధించి నోటిఫికేషన్
ఎప్పుడు వచ్చింది? పరీక్ష ఎప్పుడు పూర్తయింది? ఫలితాలు ఎప్పుడు వచ్చాయి? ఉత్తర్వులు ఎప్పుడు
ఇచ్చారు? అనే వివరాలు అందించాలని ఆదేశించింది. ఒకవేళ రాష్ట్ర
ప్రభుత్వం కేంద్రం మాదిరిగా నిర్ణయం తీసుకుంటే
ఉద్యోగులు సీపీఎస్ నుంచి ఓపీఎస్ పెన్షన్‌లోకి వచ్చే అవకాశం ఉంది.
0 Komentar