సెలవులు
పొడిగిస్తే 1-9 తరగతుల పరీక్షలు లేనట్లే!
తెలంగాణ: పాఠశాలలకు ఈనెల 31వ తేదీ తర్వాత కూడా
సెలవులు పొడిగిస్తే అప్పుడు ఒకటి నుంచి 9వ తరగతి వరకు సమ్మేటివ్ అసెస్‌మెంట్(ఎస్‌ఏ-2)
పరీక్షలు ఉండవు..! కరోనా బారిన పడకుండా ఉండేందుకు ఈనెల 31
వరకు తరగతులను రద్దు చేశారు. ఆ తర్వాత కూడా పరిస్థితి అదుపులోకి రాకపోతే అప్పటికి
వైరస్ ప్రభావం తగ్గకుంటే సెలవులు పొడిగించాల్సి ఉంటుంది. అప్పుడు 1-9 తరగతులకు పరీక్షలు నిర్వహించే అవకాశం సున్నా
అని పాఠశాల విద్యాశాఖ అధికారి ఒకరు అన్నారు. ముందుగా ప్రకటించిన కాలపట్టిక ప్రకారం
ఏప్రిల్ 7 నుంచి 16 వరకు పరీక్షలు నిర్వహించాలి. అదే నెల 24 నుంచి వేసవి సెలవులు
ఇస్తారు. అవసరమైతే పరీక్షలు పాఠశాలలు
పునఃప్రారంభం తర్వాత జూన్‌లో నిర్వహిస్తామని మరో అధికారి తెలిపారు.
0 Komentar