Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Vindam Nerchukundam IRI 2nd-6th March Programme details

Vindam Nerchukundam IRI 2nd-6th March Programme details


  "విందాం - నేర్చుకుందాం"..
నేటి రేడియో పాఠం
తేదీ : 06-03-2020
పాఠం పేరు : "Learn English is Fun"..
సమయం : 11 AM

నిర్వహణ సమయం : 30 ని.లు
---------------
"విందాం - నేర్చుకుందాం".. నేటి రేడియో పాఠం
 తేదీ : 05-03-2020
 విషయం : పరిసరాల విజ్ఞానం
 పాఠం పేరు : "మనం ఏమేమి తింటాం"
 తరగతి : 3వ తరగతి
 సమయం : 11 AM
 నిర్వహణ సమయం : 30 ని.లు
నేటి రేడియో పాఠం : " మనం ఏమేమి తింటాం" (05.03.2020)... బోధనా లక్ష్యాలు, బోధనాభ్యసనా సామాగ్రి, బోధనాభ్యాసనా కృత్యాలు, గేయం..

"విందాం - నేర్చుకుందాం"*
📻 *నేటి రేడియో పాఠం*
★ తేది : 04.03.2020
★ విషయము :   గణితము
★ పాఠం పేరు : "కూడిక"  ("మూడంకెల సంఖ్యల కూడిక")
★ తరగతి : 3వ తరగతి
★ సమయం : 11-00 AM 
★ నిర్వహణ సమయం : 30 ని.లు
〰〰〰〰〰〰〰〰 
✳ *"కూడిక" (మూడంకెల సంఖ్యల కూడిక)* 
〰〰〰〰〰〰〰〰 
✡ *బోధనా లక్ష్యాలు:*
*విద్యార్థినీ విద్యార్థులు :*
• మూడంకెల సంఖ్యలను అడ్డువరుస పద్దతిలోను, నిలువు వరుస పద్దతిలోను కూడగలరు.
• స్థాన విలువల ప్రకారం సంఖ్యల కూడిక చేయగలరు.కూడిక యొక్క ఫలితాన్ని అంచనా వేయగలరు.
• నిజజీవిత సందర్భాలలో కూడికను ఉపయోగించి సమస్యలను సాధించగలరు.
★★★★★★★★
*బోధనాభ్యసన సామాగ్రి :*
• 0-9 వరకు సంఖ్యాకార్డులు మూడు సెట్లు
• గణిత పాఠ్యపుస్తకం
• గణిత సంకలన వాక్యరూపంలో ఉన్న ఫ్లాష్ కార్డులు (12)
★★★★★★★★★★★★★
✡ *ప్రసార పూర్వ కృత్యాలు:*
అ) రేడియో పాఠం వినడానికి సంసిద్ధత (విద్యార్ధులను) గావించాలి
ఆ) బోధనాభ్యసన సామాగ్రి సమకూర్చుకోవాలి.
ఇ) రేడియో పాఠంలో ప్రసారం కాబోయే ఆటను ఆడించే విధానం తెలుసు కోవాలి.
★★★★★★★★★★★★★
✡ *ప్రసార సమయంలో కృత్యాలు :*
*కృత్యం:* 
• రెండంకెల సంఖ్యల కార్డులు,మూడంకెల సంఖ్యల కార్డులు (ఫ్లాష్ కార్డులు)
• పిల్లలను రెండు జట్లుగా చేయండి.
• ఏదో ఒక జట్టులోని విద్యార్థిచే సంకలన వాక్య రూపంలోని ఫ్లాష్ కార్డు తీయమనాలి. అది రెండు గ్రూపుల వారికి చూపాలి.
• ముందుగా సమాధానం చెప్పిన వారికి పాయింట్ ... ఇలా ఆడించాలి.
• రేడియోలో వచ్చే సూచనలకు అనుగుణంగా ఒక్కొక్క విద్యార్థిచే ఫ్లాష్ కార్డులు తీయించడం,నల్లబల్ల పై రాయించడం, కూడిక చేయించడం వరసగా చేయించాలి.
• పాఠ్యపుస్తకమును తెరిపించి 41 పేజీలోని లెక్కలను ఎలా చేయాలో వివరిస్తూ ఇంటిపనిగా
ఇవ్వా లి.
• పిల్లలందరిచే పాటను పాడించాలి. పాట రాసిన చార్టును తరగతిలో ప్రదర్శించాలి.
★★★★★★★★
✡ *పాఠ్యాంశ సంబంధిత రేడియో వినిపించబోయే పాట:*
*ఈ కార్యక్రమంలో ప్రసారమయ్యే పాటను చార్టు పై స్పష్టంగా రాసి, తరగతి గదిలో ప్రదర్శించాలి.*
🎼  *పాట*
▪▪▪▪▪▪
🎤 *పల్లవి :*
కూడికయే సంకలనం - సంకలనముయే    //కూడికయే//

🎻 *చరణం 1:*
సమూహాలలో ఉన్న వస్తువుల
మొత్తమెంతో చెప్పాలంటే
ఆ వస్తువుల సంఖ్యలనూ
కలపడమే కూడిక         //కూడికయే//

🎻 *చరణం 2:*
ఉన్న వస్తువుల కంటే
ఎక్కువ వస్తువులున్నాయంటే
ఆ వస్తువుల సంఖ్య తెలియాలంటే
మొదటి వస్తువుల సంఖ్యకూ
ఎక్కువ ఉన్న వస్తువుల సంఖ్యను
కలిపితే వచ్చేదే ఆ వస్తువుల సంఖ్య       //కూడికయే//

🎻 *చరణం 3:*
బాలుర సంఖ్య ఎంతో తెలుసూ
బాలికలా సంఖ్యా తెలుసూ
బాల బాలికల మొత్తము ఎంతో తెలియాలంటే
రెండు సంఖ్యలను కలపడమే సమాధానం ....      //కూడికయే//
✡ *పాట ప్రసార సమయంలో*
• మొదటిసారి పాట వచ్చే సందర్భములో చార్టులోని పాటను వేలితో లేదా పాయింటర్ తో చూపిస్తూ చదవాలి.
• రెండవ సారి పాటను, చార్టును చూపిస్తూ రేడియోలో వచ్చే పాటతో జతకలుపుతూ పాడించాలి.
............................................................
"విందాం - నేర్చుకుందాం".. నేటి రేడియో పాఠం
 తేదీ : 03-03-2020
 విషయం : పరిసరాల విజ్ఞానం
 పాఠం పేరు : "కలసిఉంటే కలదు సుఖం"
 తరగతి : 
 సమయం : 11 AM
 నిర్వహణ సమయం : 30 ని.లు
"విందాం - నేర్చుకుందాం".. నేటి రేడియో పాఠం

 తేదీ : 02-03-2020

 విషయం : గణితం
 పాఠం పేరు : "ఆవరణలు-ప్రహరీలు"
 తరగతి : 5వ తరగతి

 సమయం : 11 AM

 నిర్వహణ సమయం : 30 ని.లు
నేటి రేడియో పాఠం : "ఆవరణాలు ప్రహరీలు" (02.03.2020)... బోధనా లక్ష్యాలు, బోధనాభ్యసనా సామాగ్రి, బోధనాభ్యాసనా కృత్యాలు, గేయం..
Download ... 2nd March IRI Programme details
Previous
Next Post »
0 Komentar

Google Tags