What is Quarantine and Isolation?
క్వారంటైన్, ఐసొలేషన్ అంటే ఏమిటి
? వాటి అవసరం ఏమిటి ?
క్వారంటైన్ ::
వైరస్ విస్తృతంగా వ్యాపించిన
దేశాన్ని సందర్శించిన లేదా, వ్యాధిగ్రస్తుడికి దగ్గరగా మసలుకున్న
వ్యక్తులు ఆ వైరస్‌కు ప్రభావితమై ఉంటారనే కారణంతో బలవంతంగా దిగ్బంధంలో ఉంచడం లేదా
స్వీయ దిగ్బంధం విధించుకోవడం క్వారంటైన్. కదలికల్ని నియంత్రించడం దీని ముఖ్య
ఉద్దేశం.
ఒకరి నుంచి ఒకరికి ప్రత్యక్షంగా
వ్యాపిస్తున్న వైరస్‌ను కట్టడి చేయాలంటే బాధిత వ్యక్తి జన సమూహంలోకి వెళ్లకుండా
నివారించడం ఒక్కటే మార్గం. మనదేశంలో నమోదవుతున్న కేసులన్నీ ఇక్కడికి వస్తున్న
విదేశీయుల నుంచో లేదా తిరిగొస్తున్న
భారతీయుల వల్లనో నమోదవుతున్నాయి. అలా వచ్చినవారు 14 రోజులుపాటు హోమ్‌క్వారంటైన్
(స్వీయ గృహనిర్భంధం)లో ఉండాలని ప్రభుత్వం సూచిస్తోంది. దీనివల్ల వారు వైరస్
ప్రభావానికి గురయ్యారో లేదో తెలుస్తుంది.
ఐసొలేషన్ :: వైరస్ నిర్ధారణ
అయిన లేదా వ్యాధి లక్షణాలు కనిపిస్తున్న వ్యక్తుల్ని ఒక గదిలో వేరుగా ఉంచడం
ఐసొలేషన్. వైరస్ సోకిన వ్యక్తి దాన్నుంచి
కోలుకునేదాకా ఇతరులకు వ్యాపింపజేయకుండా నివారించడం ఐసొలేషన్ ముఖ్యోద్దేశం.
జాగ్రత్తలు పాటిద్దాం..
వ్యాధి లక్షణాలు కనిపించిన వ్యక్తి
తన జీవిత భాగస్వామికి, పిల్లలు, తల్లిదండ్రులు,
రూమ్ మేట్స్ కు దూరంగా ఉండడం చాలా అవసరం. ఇతరులకు కనీసం ఆరడుగుల
దూరం ఉండండి. ప్రజారవాణా, క్యాబ్ ల లాంటి వాటిని వాడొద్దు. మీరు
దగ్గినా, తుమ్మినా ఆ పరిసరాలో వైరస్ చేరుతుంది కాబట్టి తగిన
జాగ్రత్తలు తీసుకోండి. రోగి లక్షణాల్ని కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు గమనిస్తూ
ఉండాలి. పరిస్థితి ముదురుతోందని అనుకుంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. ఇంట్లో
వృద్ధులు, గర్భిణులు ఉంటే.. వారికి వైరస్ వ్యాప్తి ముప్పు
ఎక్కువ కాబట్టి.. రోగి దగ్గరకు వెళ్లకపోవడం మంచిది.
0 Komentar