White flour / Maida flour
మైదాపిండి
మిల్లులో బాగా పోలిష్ చేయబడిన గోధుమ పిండి. పసుపు రంగులో ఉండే
గోధుమ పిండిని Azodicarbonamide, Chlorine gas, మరియూ Benzoyl peroxide అనే రసాయనాలను ఉపయోగించి
తెల్లగా చేస్తారు. బెంజాయిల్ పెరాక్సైడ్ వాడుక చైనా ఐరోపా దేశాల్లో
నిషేధించబడినది. మైదా లో Alloxan అనే విషపూరితమైన రసాయనం
ఉంటుంది. అందువల్ల మైదా పిండి ముట్టుకోవడానికి మెత్తగాను, చూడటానికి
తెల్లగానూ ఉంటుంది. దక్షిణ భారతదేశంలో మైదాపిండిని ఎక్కువగా వంటల్లో వాడతారు.
కొన్ని తపాలాకార్యాలయాల్లో కూడా కవర్లు అంటించడానికి, గోడలపై
సినిమా పోస్టర్లు అంటించడానికి కూడా మైదాపిండిని వాడతారు. మైదాపిండితో రవ్వ దోసె
వంటి అట్లు, పరోటా, రుమాలీ రోటీ,
కేక్స్, కాజాలు, హల్వా,
జిలేబీ మొదలైన మిఠాయిలు, బొబ్బట్లు, బ్రెడ్ మొదలైన పిండి వంటలు తయారుచేసుకోవచ్చును.
మాంసం తయారీలో
మిగిలిన వ్యర్ధ పదార్ధాలను, కరెంటుతో వేడి చేసి, ఉడికిస్తే
అందులో ఉన్న కొవ్వు పదార్ధం అంతా పైకి
తేలుతుంది. ఆ కొవ్వు పదార్ధాన్ని, పాశ్చాత్య దేశాల్లో
తయారుచేసి, అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఎగుమతి
చేస్తున్నారు. దీనికి మైదా, చక్కెర కలిపి బేకరీ
పదార్ధాలను తయారుచేస్తున్నారు. శాకాహారులైనా ఈ బిస్కెట్లు, రస్కులు
తింటే, మాంసాహారం తిన్నట్లే అవుతుంది.
దుష్ఫ్రభావాలు
*దీనిలో ఉండే Alloxan క్లోమ
గ్రంధిలో (pancreas ) ఇన్సులిన్ తయారు చేసే బీటా సెల్స్ ని
నిదానంగా నాశనం చేస్తుంది. దాంతో క్లోమ
గ్రంధి దెబ్బ తింటుంది.
*మైదా పిండి నిత్యం లేక అధికంగా వాడటం వల్ల
మధుమేహం, గుండె జబ్బులు రావడం, కిడ్నీల్లో
రాళ్ళు ఏర్పడటం, ఆడపిల్లలు శీఘ్రంగా పుష్పవతి అవ్వడం వంటి
దుష్ప్రభావాలు ఉన్నాయి
*మైదాతో చేసిన పదార్థాలు – కేకులు, బిస్కెట్లు, పిజ్జాలు, బర్గర్లు, నూడుల్స్ తింటే మరీ దారుణంగా 10 నిముషాలలోనే గ్లూకోస్ గా మారి రక్తంలోకి ప్రవేశిస్తాయి. దీని వల్ల మధుమేహ
రోగం లేని వాళ్లకు కూడా మధుమేహం వస్తుంది.
*నూడుల్స్
తినిపిస్తే పిల్లల క్లోమ గ్రంధి రసాలు తగ్గిపోతాయి.
ప్రత్యామ్నాయ పదార్థాలు
సిరిధాన్యాల
పిండితో,
తాటి బెల్లం కలిపి బిస్కట్స్ వంటి పదార్థాలు తయారు చేసుకోవచ్చు.
0 Komentar