WHO Chief answered Priyanka Chopra's questions
on coronavirus ..
కరోనా వైరస్‌పై ప్రియాంక
చోప్రా ప్రశ్నలకు WHO సమాధానం..
ప్రముఖ నటి, యూనిసెఫ్
గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఉన్న ప్రియాంక చోప్రా కరోనా వైరస్‌పై ప్రజల్లో అనుమానాల
నివృత్తి కోసం చక్కటి ప్రయత్నం చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో కాన్ఫరెన్స్
ద్వారా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చీఫ్ టెడ్రోస్ అధనోమ్‌తో మాట్లాడి
అభిమానుల పంపిన ప్రశ్నలకు ఆయన నుంచి సమాధానాలు రాబట్టారు.
ఆ ప్రశ్నలు, వాటి
సమాధానాలు
ప్రశ్న: ఈ వైరస్ గాలి ద్వారా వ్యాపిస్తుందా?
సమాధానం: కరోనా వైరస్ గాలి ద్వారా ఇతరులకు సోకదు. తుమ్మినపుడు లేదా దగ్గినపుడు ముక్కు, నోటి నుంచి వచ్చే తుంపర్లు ఇతరులపై పడితే ఈ వైరస్ వారికి సంక్రమించే అవకాశం ఉంది. అందుకే మోచేతిని అడ్డం పెట్టుకొని తుమ్మాలి. అలాగే చేతుల్ని తరచూ శుభ్రం చేసుకోవాలి.
ప్రశ్న: వైరస్ నుంచి ఒకసారి కోలుకుంటే మళ్లీ వచ్చే అవకాశం ఉందా?
సమాధానం: ఈ విషయంలో ఇంకా పూర్తి స్పష్టత లేదు. ఇప్పటికైతే లక్ష మందికిపైగా కోలుకున్నారు.
ప్రశ్న: నేను
టైప్-1 డయాబెటిస్‌తో, ప్రియాంక ఆస్తమాతో బాధపడుతున్నాం.
మాపై వైరస్ ప్రభావం ఉంటుందేమోనని భయంగా ఉంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు
ఎలాంటి అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి.
సమాధానం: మీరు
స్వీయ నిర్బంధంలో ఉండి మంచి పని చేస్తున్నారు. డయాబెటిస్, హృదయ,
శ్వాస సంబంధిత, క్యాన్సర్, వయోభారం వంటి సమస్యలతో బాధపడుతున్న వారు వైరస్ ప్రభావానికి లోనుకాకుండా
జాగ్రత్త వహించాలి. ఎలాంటి అనారోగ్య సమస్యలూ లేనివారు కూడా ఇంటికే పరిమితం కావాలి.
ఈ వైరస్‌కు ఎవరూ అతీతం కాదు.
సూచన: మేము
ఇచ్చిన సమాచారం కేవలం అవగాహనకు మాత్రమే.. ఈ మహమ్మారిని అరికట్టేందుకు ఉన్న
అత్యంత సులువైన మార్గం సామాజిక దూరం ( సోషల్ డిస్టెన్సింగ్)
0 Komentar