ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత పడనుందా ?
ఆదివారం (మార్చి 29,2020) కరోనాపై సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఈపాటికి మనకు రూ. 12 వేల కోట్లు రావాలి. మార్చి 15 నుంచి ఆదాయం అంతా
సున్నాలా ఉంది. ఎక్సైజ్, పెట్రోల్, జీఎస్టీ
అన్నీ బంద్. ఎమ్మెల్యేల జీతాలు కూడా బంద్ పెట్టాల్సి వస్తే బంద్ పెడ్తం.
ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కూడా కోత కోయాల్సి వస్తే కోయాలి కదా. దీనికి ఎవరూ అతీతులు
కాదు. ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్రంలో భాగం కదా. కష్టం వస్తే అందరూ పంచుకోవాలి. ఇది
లగ్జరీ సమయం కాదు. సంక్షోభంలో ఉన్నం. అందరూ తగ్గించుకోవాలి. రెండు బుక్కలకు బదులు
ఒక బుక్కనే తినాల. రాష్ట్రంలో బంద్ అయితే కేంద్రానికి కూడా బంద్ అవుతది. ప్రతిదీ
నిలిచిపోతుంది. రెండు నెలలో, మూడు నెలలో, నాలుగు నెలలో ఈ గండం గట్టెక్కే దాకా అందరూ ఊపిరి బిగపట్టుకొని కొంచెం
నియంత్రణ పాటించాలి. అందరం రాజీపడితే ఈ సమాజం నడుస్తది. విరాళాల కోసం పిలుపు
ఇవ్వాల్సిన అవసరం లేదు. గొప్పవాళ్లు వచ్చి ఇస్తున్నరు. వారికి శతకోటి దండాలు.
0 Komentar