YUVIKA 2020 -
Provisional Selection List
ఇస్రో యువికా-20
తొలి జాబితా
*తెలుగు
రాష్ట్రాల్లో 20 మంది విద్యార్థుల ఎంపిక
ఇస్రో
విద్యార్థుల కోసం రూపొందించిన యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ (యువిక-యువ విజ్ఞాన
కార్యక్రమం) కోసం దేశవ్యాప్తంగా 368 మంది విద్యార్థులను ఎంపిక చేసి తొలి
జాబితాను విడుదల చేసింది. దేశంలో విద్యార్థులకు స్పేస్ టెక్నాలజీ, స్పేస్ సైన్స్, స్పేస్ అప్లికేషన్లపై ప్రాథమిక
విజ్ఞానాన్ని తెలియజేయడంతోపాటు అంతరిక్ష కార్యకలాపాలపై వారిలో ఆసక్తిని
రేకెత్తించాలని ఇస్రో- 2019 నుంచి ఈ కార్యక్రమం
నిర్వహిస్తోంది. ప్రస్తుతం రెండో ఏడాది ఈ
కార్యక్రమ నిర్వహణకు విద్యార్థులను ఎంపిక చేస్తున్నారు. దేశవ్యాప్తంగా సీబీఎస్‌సీ,
ఐపీఎస్‌సీ, రాష్ట్ర సిలబస్‌లో తొమ్మిదో తరగతి
చదివే వారి నుంచి ఫిబ్రవరి 3 నుంచి మార్చి 5వ తేదీ వరకు దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా ఇస్రో స్వీకరించింది.
*దరఖాస్తులను
పరిశీలించి 368 మందిని ఎంపిక చేసి తొలిజాబితా విడుదల చేశారు.
*ఎంపికైన
విద్యార్థులు వారి ధ్రువీకరణ పత్రాలను ఈ నెల 26 లోగా ఇస్రో
వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని ఇస్రో కోరింది.
*వీరిలో
ఒక్కో రాష్ట్రంతోపాటు కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ముగ్గురు చొప్పున ఎంపిక చేసి ఈ
నెల 31వ తేదీ తుది జాబితాను ఇస్రో ప్రకటించనుంది.
*అలా
ఎంపికైన విద్యార్థులకు అహ్మదాబాదు, బెంగుళూరు, షిల్లాంగ్, తిరువనంతపురంలలో మే 11 నుంచి 22వ తేదీ వరకు శిక్షణ నిర్వహించనున్నారు.
ఎంపికైన ప్రతి విద్యార్థితోపాటు ఒక సంరక్షకుడికి ఇస్రో రవాణా, వసతి సౌకర్యాలను కల్పించనుంది.
*ఈ
కార్యక్రమం కోసం ఇస్రో ఎంపిక చేసిన తొలి జాబితాలో తెలుగు రాష్ట్రాలలో 20 మంది విద్యార్థులు ఎంపికయ్యారు
YUVIKA 2020 -
Provisional Selection List
For Registration
Form
Official website
0 Komentar