టెన్త్
విద్యార్థులకు ఆడియో పాఠాలు: మంత్రి
రాష్ట్రంలో
ఇప్పటికే సప్తగిరి ఛానల్ ద్వారా పదవ తరగతి విద్యార్థులకు పాఠాలు వినిపిస్తున్నామని, ఆకాశవాణి
ద్వారా ఆడియో పాఠాలు కూడా వినిపించేందుకు చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి
డాక్టర్ ఆదిమూలపు సురేష్ విద్యాశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. శుక్రవారం అన్ని
జిల్లాల విద్యాశాఖాధికారులు, ప్రాజెక్టు అధికారులతో జరిగిన
వీడియో కాన్ఫెరెన్స్‌లో విద్యాశాఖ మంత్రి మాట్లాడారు. పాఠశాల విద్యార్థులకు పాఠ్యoశాలు బోధన, నాడు నేడు కార్యక్రమంలో పాఠశాలల
అభివృద్ధి, మధ్యాహ్నం భోజనం తదితర అంశాలపై మంత్రి సురేష్
చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో 10వ తరగతి విద్యార్థుల
పరీక్షలు ఎన్నికల కారణంగా ఒకసారి, కరోనా వైరస్ నేపథ్యంలో మరో
సారి వాయిదా వేయడం జరిగిందన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నoదున 10 వ తరగతి విద్యార్థులకు విద్యా అమృతం పథకం క్రింద ప్రతి రోజు
దూరదర్శన్ ఛానల్‌లో ఉదయం10 గంటల నుండి11 గంటల వరకు, సాయంత్రం
4 గంటల నుంచి 5 గంటల వరకు బోధనా తరగతులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఆకాశవాణి
ద్వారా కూడా పాఠాలు వినిపించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్
పరిస్థితులను సమీక్షించుకొని 10 వ తరగతి పరీక్షలు నిర్వహించడానికి చర్యలు
తీసుకుంటామని ఆయన తెలిపారు.
అదే విధంగా
రాష్ట్రంలో నాడు- నేడు పథకం క్రింద అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు
కల్పించాలని ఆయన అన్నారు. తల్లిదండ్రుల కమిటీలతో విద్యాశాఖ అధికారులు సమీక్షలు
నిర్వహించాలన్నారు. లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూనే త్వరితగతిన పాఠశాలల్లో
అభివృద్ధి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. రాష్ట్రంలో లాక్‌డౌన్
కారణంగా పాఠశాలలు మూసివేయడం జరిగిందన్నారు. పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు
ఇబ్బంది లేకుండా బియ్యం, గుడ్లు, చిక్కిలు
పంపిణీ చేయాలని ఆదేశించారు. లాక్ డౌన్ సమయంలో పోలీసులు అందిస్తున్న సేవల్లో
ఉపాధ్యాయులు కూడా భాగస్వాములై సేవలు అందించటాన్ని మంత్రి అభినందించారు. ఈ వీడియో
కాన్ఫరెన్స్‌లో విద్యాశాఖ కమిషనర్ చిన్నవీరభద్రుడు, పలువురు
అధికారులు, అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులు, మంత్రితో పాటు మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి, మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం. శేషి రెడ్డి పాల్గొన్నారు.
0 Komentar