లాక్‌డౌన్ తరువాత
రెండు వారాల సమయమిచ్చి పదో తరగతి పరీక్షలు - మంత్రి సురేష్
* రాష్ట్రాల
విద్యాశాఖ మంత్రులతో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ జరిపిన వీడియో
కాన్ఫరెన్స్ లో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడి..
లాక్‌డౌన్
ముగిసిన రెండు వారాల అనంతరం పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్
విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. దీనికి సంబంధించిన పరీక్ష షెడ్యూల్
త్వరలో విడుదల చేస్తాం అన్నారు. రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులతో కేంద్ర మంత్రి
రమేశ్ పొఖ్రియల్ నిశాంక్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం సురేశ్
మీడియాతో మాట్లాడారు. ‘‘సామాజిక
దూరం పాటిస్తూ పరీక్షల నిర్వహనకు ఏర్పాట్లు చేస్తాం. డిజిటల్, ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌ను విస్తృతంగా వాడుకోవాలని కేంద్రమంత్రి సూచిచారు’’
అని సురేష్ చెప్పారు.
విద్యా
సంవత్సరంలోనే కాకుండా వేసవిలో కూడా మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని ఈ సందర్భంగా
నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచన మేరకు ‘జగనన్న
గోరుముద్ద’ పేరుతో మధ్యాహ్న భోజన పథకంలో మార్పులు చేశామని
మంత్రి ఆదిమూలపు సురేష్ కేంద్రమంత్రికి తెలిపారు.
దేశంలో
ఎక్కడాలేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో 9,10 తరగతుల విద్యార్థులకు
మధ్యాహ్న భోజన పథకం వర్తింపజేశామని మంత్రి తెలిపారు. ఈ మేరకు వారికి సహాయ సహకారాలు
అందించాలని కేంద్రమంత్రిని కోరారు. రాష్ట్రానికి మరిన్ని కేజీబీవీ, మోడల్ స్కూళ్లను మంజూరు చేయాలని కోరారు. రాష్ట్రంలో రేడియో, దూరదర్శన్ ద్వారా డిజిటల్, ఆన్ లైన్ క్లాస్‌లను అమలు
చేస్తున్నామని మంత్రి తెలిపారు.
0 Komentar