కరోనా నివారణలో
సహకరిస్తే ప్రభుత్వ ఉద్యోగాలకు 15 శాతం వెయిటేజి మార్కులు
కరోనా నివారణ
చర్యల్లో భాగంగా నియమితులైన వైద్య సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం మంచి అవకాశం
కల్పించింది. ప్రాణలను పణంగా పెట్టి సేవలందిస్తున్న కాంట్రాక్టు, అవుట్
సోర్సింగ్ సిబ్బందికి భవిష్యత్తు నియామకాల్లో 15శాతం
వెయిటేజి ఇవ్వాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఈ మార్గదర్శకాలను అనుసరించే
సిబ్బందిని నియమించాలని స్పష్టం చేసింది.
కరోనా వైరస్
నివారణ చర్యల్లో భాగంగా నియమితులైన... కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్
సిబ్బందికి భవిష్యత్ నియామకాల్లో వెయిటేజి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈమేరకు వైద్యారోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. కొవిడ్ ఆస్పత్రుల్లో పనిచేసేందుకు
ముందుకు వచ్చే వైద్యులకు, నర్సులకు భవిష్యత్తులో చేపట్టే
నియామకాల్లో 15 శాతం వెయిటేజి ఇవ్వాల్సిందిగా... కలెక్టర్లు,
ఉన్నతాధికారులకు సూచించింది. ప్రస్తుతం చేపట్టే నియామకాల్లో ఈ
మార్గదర్శకాలను అనుసరించే...సిబ్బందిని తీసుకోవాల్సిందిగా వైద్యారోగ్యశాఖ స్పష్టం
చేసింది.
0 Komentar