Aarogya Setu APP
కరోనా లక్షణాలు ఉన్న
వ్యక్తికి దగ్గర్లో ఉంటే ‘ఆరోగ్య సేతు’ యాప్
వెంటనే చెప్పేస్తుంది..!
ఇకపై కచ్చితంగా 'ఆరోగ్య
సేతు'!
కోవిడిపై సమగ్ర సమాచారమిచ్చే ఆరోగ్య పేరు యాప్ ఇకపై అన్ని స్మార్ట్ ఫోన్లలో
కచ్చితంగా ఉండనుంది. ఫోన్‌ను అమ్మడానికి ముందే ఆ యాప్ అన్ని స్మార్ట్ ఫోన్లలో ఇన్‌స్టాల్
చేయడంతోపాటు, ఆ యాప్ లో రిజిస్టర్ చేసుకున్నాకే వినియోగదారుడు ఆ ఫోన్‌ను వాడేలా చూడాలని
కేంద్రం ఆదేశాలు జారీ చేయాలనుకుంటోంది. ఇందుకు సంబంధించి టెలికం సంస్థలతో
సంప్రదింపులు జరిపేందుకు ఒక నోడల్ ఏజెన్సీని కూడా నియమించాలనుకుంటోందని సంబంధిత
అధికార వర్గాలు తెలిపాయి.
★ కరోనాను దరి చేరకుండా
అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఓ యాప్‌ను రూపొందించింది. యాప్‌ను
గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి.
★ పేరు, మొబైల్ నంబర్‌తో రిజిస్టార్ చేసుకోవాలి. మన ఆరోగ్య విషయాలను. ఇతర
ఆధారాలను నమోదు చేయాలి.
★ ఫోన్‌లో జీపీఎస్, బ్లూటూత్ సిస్టమ్‌ను ఆన్‌లో ఉంచాలి. ఆరోగ్య సేతు యాప్ 11 భాషల్లో అందుబాటులో ఉంది. ఇందులో మీ సమాచారమంతా రహస్యంగా ఉంటుంది.
యాప్ ప్రయోజనాలు..
★ కరోనా బారిన పడిన వారి
దగ్గరకి సమీపిస్తే మనల్ని హెచ్చరిస్తుంది.
★ కేసుల అప్‌డేట్
తెలుసుకోవచ్చు.
★ కరోనా బారిన పడకుండా
ఉండేందుకు సహాయపడుతుంది
★ కరోనావైరస్ ఉన్న వ్యక్తికి
దగ్గరగా వెళ్తే యాప్ మీ లొకేషన్ స్కాన్ చేసి.. మీ డేటాను ప్రభుత్వానికి చేరవేస్తుంది.
★ కోవిడ్ -19 లక్షణాలు ఏమైనా ఉన్నాయా అని నిర్థారించడానికి ప్రత్యేకమైన
చాట్‌బోట్ ఉంటుంది.
★ ప్రభుత్వాలు చేసే ప్రకటనలు,
తీసుకునే చర్యలను తెలియజేస్తుంది.
యాప్ డౌన్‌లోడ్
కోసం క్రింది లింక్ ను క్లిక్ చేయండి..
Aarogya Setu APP DOWNLOAD
0 Komentar