‘జగనన్న
విద్యాదీవెన’ ను ప్రారంభించనున్న సీఎం జగన్
*గతంలో
చెల్లించాల్సిన బకాయిలు రూ.1,880 కోట్ల తోపాటు మొత్తం రూ.4వేల కోట్లు విడుదల
ముఖ్యమంత్రి
వైఎస్ జగన్ మంగళవారం మరో ప్రతిష్టాత్మక పథకమైన ‘జగనన్న విద్యా
దీవెన’ను ప్రారంభించనున్నారు. 2018–19
విద్యా సంవత్సరానికి చెల్లించాల్సిన రూ.1,880 కోట్లను విడుదల
చేసింది. అలాగే, 2019–20 విద్యా సంవత్సరానికి చెల్లించాల్సిన
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కూడా విడుదల చేసింది. ఈ రెండేళ్లకు సంబంధించి ప్రభుత్వం
మొత్తం రూ.4వేల కోట్లు విడుదల చేసింది. కాగా, 2019–20 విద్యా సంవత్సరానికి సంబంధించి తల్లిదండ్రులు కాలేజీలకు ఫీజులు చెల్లించి
ఉంటే.. ఆ మొత్తం ఏప్రిల్ నెలాఖరులోగా తిరిగి ఇచ్చేసేందుకు కాలేజీ యాజమాన్యాలను
సంప్రదించాలని విద్యాశాఖ సూచించింది. 2018–19, 2019–20లో రూ.35 వేలు ఫీజు ఉన్న కాలేజీలకు ఇప్పటికే ఏమైనా కట్టి ఉంటే.. ఆ సొమ్మును కూడా
తిరిగి రాబట్టుకోవాలని తెలిపింది.
2020–21లో నేరుగా తల్లుల ఖాతాల్లోకి..
ఇదిలా ఉంటే..
రానున్న విద్యా సంవత్సరం 2020–21లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను
కాలేజీలకు కాకుండా నేరుగా తల్లుల ఖాతాల్లోకి ప్రభుత్వం జమ చేయనుంది. దాదాపు 14 లక్షల మంది తల్లుల ఖాతాల్లో నాలుగు దఫాలుగా (నాలుగు త్రైమాసికాలకు) డబ్బు
వేయనున్నారు. కానీ, తల్లిదండ్రులు మాత్రం కాలేజీకి వెళ్లి
ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఇలా కాలేజీలకు వెళ్లడం, ఫీజులు
నేరుగా చెల్లించడంవల్ల.. అక్కడ విద్యాబోధన, సౌకర్యాలు,
ఇతర వసతుల గురించి ఆరా తీయడం, పరిష్కారం కాని
సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వం ఈ
నిర్ణయం తీసుకుంది.
0 Komentar