నేడు వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం ప్రారంభం
పొదుపు సంఘాలకు వైఎస్సార్
సున్నా వడ్డీ పథకాన్ని సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. క్యాంపు
కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో పొదుపు సంఘాల ఖాతాలకు సున్నా వడ్డీ డబ్బులను జమ
చేసే బటన్‌ను నొక్కుతారు. ఈ బటన్ నొక్కగానే సెర్ప్, మెప్మాల పరిధిలోని
గ్రామ, పట్టణ ప్రాంతాల్లో ఉండే 8,78,874 పొదుపు సంఘాల ఖాతాల్లో సీఎఫ్‌ఎంఎస్ ద్వారా ఒకే విడతన డబ్బులు జమ
అవుతాయని సెర్ప్ సీఈవో రాజాబాబు తెలిపారు. 90,37,254 మహిళలు
సభ్యులుగా ఉండే ఆయా సంఘాల ఖాతాల్లో రూ.1,400 కోట్లు ఒకే విడత
జమ అవుతుంది.
0 Komentar