AP EAMCET after JEE Mains
జేఈఈ మెయిన్స్ తర్వాతే ఏపీ ఎంసెట్
లాక్ డౌన్ నేపథ్యంలో ఈనెల 20నుంచి నిర్వహించాల్సిన ఎంసెట్
పరీక్షలను ఉన్నత విద్యామండలి వాయిదా వేయాలని నిర్ణయం తీసుకుంది. తొలుత ప్రకటించిన
షెడ్యూల్ ప్రకారం ఈ నెల 20 నుంచి 24 వరకు
ఈ పరీక్ష ఆన్‌లైన్ (కంప్యూటర్ ఆధారితం)లో నిర్వహించాల్సి ఉంది. లాక్‌డౌన్
కారణంగా ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్)కు దరఖాస్తుల సమర్పణ గడువును రాష్ట్ర
ఉన్నత విద్యా మండలి ఈ నెల 17 వరకు
పొడిగించించిన విషయం తెలిసిందే. ఆలస్య రుసుంతో దరఖాస్తుల సమర్పణకు గడువు తేదీలు, దరఖాస్తుల్లో
సవరణ , హాల్
టికెట్ల డౌన్‌లోడింగ్ తదితర వివరాలను త్వరలో తెలియజేస్తామని ఉన్నత విద్యా మండలి
తాజాగా తెలిపింది.
జేఈఈ మెయిన్స్ పరీక్ష తర్వాతే ఏపీ ఎంసెట్ నిర్వహించనున్నారు. జేఈఈ
పరీక్షలతో పాటు ఏపీ ఎంసెట్ ఆన్లైన్ పరీక్షలను టీసీఎస్ సంస్థ నిర్వహిస్తోంది. రెండు
పరీక్షలను ఒకే సంస్థ నిర్వహిస్తుండడంతో జేఈఈ మెయిన్స్ తర్వాత ఎంసెట్
నిర్వహించనున్నారు. లాక్‌డౌన్ కొనసాగింపుపై స్పష్టత రాగానే కొత్త షెడ్యూల్
ప్రకటిస్తామని మండలి వర్గాలు చెబుతున్నాయి.
0 Komentar