రాష్ట్ర ఈసీగా
హైకోర్టు రిటైర్డ్ జడ్జి
ఈసీ పదవీ కాలం 5
నుంచి 3 ఏళ్లకు కుదింపు.. పంచాయతీరాజ్ చట్టానికి సవరణలతో
ఆర్డినెన్స్
గవర్నర్ ఆమోదం
తర్వాత ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
ఏ.పి. ప్రభుత్వం హైకోర్టు
రిటైర్డ్ న్యాయమూర్తిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ)గా నియమించేలా
చట్టానికి సవరణ చేస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఈ మేరకు పంచాయతీరాజ్ చట్టం–1994 సెక్షన్–200కు చేసిన సవరణల ఆర్డినెన్స్‌కు గవర్నర్
విశ్వభూషణ్ ఆమోద ముద్ర వేయడంతో రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. ఇప్పటి
వరకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్లుగా నియమితులవుతూ
వచ్చారు. ఇక మీదట హైకోర్టు రిటైర్డ్ జడ్జి.. ఎస్‌ఈసీ కానున్నారు. ఈ నిర్ణయం దేశంలో స్థానిక సంస్థల ఎన్నికల
నిర్వహణలో నూతన ఒరవడి సృష్టించనుంది. హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో స్థానిక
సంస్థల ఎన్నికలు నిర్వహించడం దేశంలో ఇదే ప్రథమం కానుంది. ఇందువల్ల అత్యంత
పారదర్శకంగా, నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుందని
ప్రజాస్వామ్యవాదులు, న్యాయనిపుణులు, విశ్లేషకులు,
మేధావివర్గాలు అభిప్రాయ పడుతున్నారు.
తాజా ఆర్డినెన్స్
లోని ముఖ్యాంశాలు
* రాష్ట్ర
ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని 5 ఏళ్ల నుంచి 3
ఏళ్లకు కుదింపు. మరో 3 సంవత్సరాల పదవీ కాలాన్ని గవర్నర్ తన
అభీష్టం మేరకు పొడిగించడానికి అవకాశం కల్పించారు.
* ఒక వ్యక్తిని
గరిష్టంగా ఎస్‌ఈసీగా రెండు పర్యాయాలు (3+3 ఏళ్లు) మాత్రమే
కొనసాగించాలని పరిమితి విధించారు.
* ఇప్పటి వరకు
రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్లుగా నియమితులవుతూ వచ్చారు. ఇక
మీదట హైకోర్టు రిటైర్డ్ జడ్జి.. ఎస్‌ఈసీ కానున్నారు.
ప్రస్తుత రాష్ట్ర
ఈసీ తొలగింపు
ప్రస్తుతం ఎస్‌ఈసీగా పని చేస్తున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నిమ్మగడ్డ
రమేష్‌కుమార్ 2016 ఏప్రిల్ 1వ తేదీన
ఆ బాధ్యతల్లో చేరారు. నాలుగేళ్లకు పైగానే ఆ బాధ్యతల్లో కొనసాగుతున్నారు. తాజా
ఆర్డినెన్స్ ప్రకారం.. ఎస్‌ఈసీ పదవీకాలం మూడేళ్లు. ఫలితంగా నిమ్మగడ్డ పదవీకాలం
పూర్తయింది. దీంతో ఆయన స్థానంలో.. ఆర్డినెన్స్‌లో పేర్కొన్న నిబంధనల ప్రకారం కొత్త
ఎస్‌ఈసీని నియమించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
0 Komentar