ఉపాధ్యాయ అర్హత పరీక్షకు దస్త్రం సిద్ధం!
*విడివిడిగానే టెట్, డీఎస్సీ
*డీఎస్సీ-18
పోస్టుల భర్తీ తర్వాతే కొత్త నియామకాల ప్రకటన
ఈనాడు, అమరావతి:
డీఎస్సీకి ముందు ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ
దస్త్రం సిద్ధం చేసింది. ఉపాధ్యాయ నియామక పరీక్ష(టీఆర్‌టీ), టెట్‌ను
విడివిడిగా నిర్వహించాలని నిర్ణయించింది. డీఎస్సీ-2018
పోస్టుల భర్తీ పెండింగ్‌లో ఉన్నందున ఆ నియామక ప్రక్రియ అయ్యేలోపు టెట్
పూర్తిచేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం లాక్‌డౌన్ కొనసాగుతుండడంతో నిర్ణీత
తేదీలను ప్రకటించకుండానే నిర్వహణకు దస్త్రాన్ని సిద్ధం చేశారు. ప్రభుత్వం నుంచి
అనుమతి వచ్చిన తర్వాత షెడ్యూల్‌ను నిర్ణయిస్తారు. ఈ ఏడాదీ పరీక్షను ఆన్‌లైన్‌లోనే
నిర్వహించాలని భావిస్తున్నారు. గతంలోనే టెట్‌ను ఆన్‌లైన్ చేస్తూ ప్రభుత్వం
ఉత్తర్వులు జారీ చేసిన విషయం గమనార్హం.
లెక్కతేలని ఖాళీలు..
రాష్ట్ర ప్రభుత్వం జనవరిలో ఉద్యోగ నియామకాల కేలండర్‌ను సిద్ధం
చేయాలని చెప్పడంతో పాఠశాల విద్యాశాఖ ఖాళీలను సేకరించింది. ఈ జాబితాను
ప్రభుత్వానికి సమర్పించింది. ఆర్థిక శాఖ అనుమతి లభించినప్పటికీ ఖాళీలపై ప్రభుత్వం
నుంచి ఇంకా ఆమోదం లభించలేదు. అధికారుల లెక్కల ప్రకారం సుమారు 8వేల పోస్టులకు డీఎస్సీ ప్రకటన వచ్చే అవకాశం
ఉంది. ఇందులో స్కూల్ అసిస్టెంట్లు 3వేలు, టీజీటీ, పీజీటీలు 300, మిగతావి
ఎస్జీటీ పోస్టులు ఉండనున్నాయి.
పెండింగ్ పోస్టులు ఇచ్చాకే..
డీఎస్సీ-2018
పెండింగ్ పోస్టులను భర్తీ చేసిన తర్వాతనే కొత్త డీఎస్సీ నిర్వహించాలని అధికారులు
భావిస్తున్నారు. న్యాయ వివాదాలతో ఎస్జీటీ-2,278, పీఈటీ-340,
భాషాపండితులు-248, ఆదర్శపాఠశాలల
ప్రిన్సిపాళ్లు-77, బీసీ రెసిడెన్షియల్ సంక్షేమ పాఠశాలల
ప్రిన్సిపాళ్లు-12 పోస్టులు భర్తీ కాలేదు. ఎలాంటి వివాదాలు
లేని మ్యూజిక్ టీచర్ పోస్టులు-59 పెండింగ్‌లో ఉన్నాయి.
0 Komentar