ఆంగ్లమా...
తెలుగా..
! మాధ్యమంపై మూడు ఆప్షన్లు
రాష్ట్రంలోని
అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు బోధనా మాధ్యమంగా ఏ భాష
ఉండాలన్న అంశంపై తల్లిదండ్రుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయ సేకరణ చేపట్టింది.
ఈ విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులకే పూర్తి స్వేచ్ఛనిచ్చింది. 2020-21 విద్యా సంవత్సరం నుంచి 1-6వ తరగతి విద్యార్థులకు ఏ
మాధ్యమంలో బోధన కోరుకుంటున్నారో వారి తల్లిదండ్రులు సచివాలయ కార్యదర్శులు అందచేసే
ఆప్షన్ ఫార్మాట్ల ద్వారా తెలియచేయాలి.
మూడు ఆప్షన్లు
ఇవీ..
1. తెలుగు తప్పనిసరిగా బోధిస్తూ ఇంగ్లీషు మీడియం
2. తెలుగు మీడియం
3. ఇతర భాషా మీడియం
ప్రొఫార్మాలో
సమాచారం ఇలా ఇవ్వాలి...
*
జిల్లా విద్యాధికారిని ఉద్దేశిస్తూ తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏ
మాధ్యమంలో బోధన కోరుకుంటున్నారో ప్రొఫార్మా ద్వారా తెలియచేయాలి.
* 2020–21 విద్యా సంవత్సరంనుంచి తమ కుమారుడు/కుమార్తెకు ఏ మాధ్యమంలో బోధన
కోరుకుంటున్నారో తెలిపేందుకు 3 ఆప్షన్లు
* ఎంపిక చేసుకున్న మాధ్యమానికి ఎదురుగా టిక్ చేయాలి, ఎంపిక
చేసుకోని వాటికి ఎదురుగా ఇంటూ గుర్తు పెట్టాలి.
* తల్లి/తండ్రి/సంరక్షుకుడు సంతకం తప్పనిసరిగాచేయాలి.
* కుమారుడు/కుమార్తె పేరు, ఏ గ్రామం, పాఠశాల, ఏ తరగతి, ఏ మాధ్యమం
కావాలో స్పష్టం చేస్తూ తేదీతో సంతకం చేయాలి.
0 Komentar