ఆర్యభట్ట నేషనల్
మ్యాథ్స్ కాంపిటీషన్
ప్రపంచానికి
జీరోను పరిచయం చేసిన.. భారత గణిత శాస్తవేత్త ఆర్యభట్ట పేరుమీద ఇండియా కౌన్సిల్ ఫర్
టెక్నికల్ స్కిల్ డెవలప్మెంట్ (ఏఐసీటీఎస్డీ).. ఆర్యభట్ట నేషనల్ మ్యాథ్స్
కాంపిటీషన్ను ప్రారంభించింది. భవిష్యత్ భారత్ కు అవసరమైన టెక్నాలజీ సైంటిస్ట్లను
గుర్తించి ప్రోత్సహించే ఉద్దేశంతో ఆర్యభట్ట నేషనల్ మ్యాథ్స్ కాంపిటీషన్ను
నిర్వహిస్తోంది.
అర్హతలు
ఏదైనా స్కూల్
లేదా ఏదైనా కాలేజీలో చదివే విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు. తమ గణిత నైపుణ్యాలను
ప్రదర్శించాలనుకునే విద్యార్థులు ఎవరైనా ఈ పరీక్ష రాయొచ్చు.
వయసు 10
ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
ప్రయోజనాలు
మొదటి బహుమతి..
ఈ పరీక్షలో
ప్రతిభ కనబర్చిన అభ్యర్థులకు మొదటి బహుమతి కింద రూ.75,000 అందిస్తారు. అంతేకాకుండా
నేషనల్ లెవల్ ఇండస్ట్రి యల్ సర్టిఫైడ్ ఏఐసీటీఎస్డీ సర్టిఫికే ట్ను ఇస్తారు. నేషనల్
మ్యాథమెటికల్ సైంటిస్ట్ ట్రోఫీ లభిస్తుంది. రోబోటిక్స్లో ఆర్ అండ్ డీ, ఆటోమేషన్, సాఫ్ట్వేర్ రంగాల్లోని నిపుణులతో ఆన్లైన్
విధానంలో శిక్షణ పొందొచ్చు (లక్ష రూపాయలు వెచ్చిస్తారు). ఏఐసీటీఎస్డీ నిర్వహించే
అంతర్జాతీయ పోటీలో పాల్గొనే అవకాశం కల్పిస్తారు. దీంతోపాటు నేషనల్ మ్యాథమెటిక్స్
సైంటిస్ట్ స్కాలర్షిప్ను అందిస్తారు.
రెండో బహుమతి..
దీంట్లో రెండో
బహుమతి కింద రూ.25,000 అందిస్తారు. అలాగే నేషనల్ లెవల్
ఇండస్ట్రియల్ సర్టిఫైడ్ ఏఐసీటీఎస్డీ సర్టిఫికేట్ను ఇస్తారు. నేషనల్ మ్యాథమెటికల్
సైంటిస్ట్ ట్రోఫీ లభిస్తుంది. రోబోటిక్స్లో ఆర్ అండ్ డీ, ఆటోమే
షన్ అండ్ సాఫ్ట్వేర్ రంగాల్లోని నిపుణులతో 6 నెలల పాటు
ఆన్లైన్ శిక్షణ(రూ.50వేలు వెచ్చిస్తారు) ఇస్తారు.
ఏఐసీటీఎస్డీ నిర్వహించే అంతర్జాతీయ పోటీలో పాల్గొనే అవకాశం కల్పిస్తారు. దీంతో
పాటు నేషనల్ మ్యాథమెటిక్స్ సైంటిస్ట్ స్కాలర్షిప్ను అందిస్తారు.
మూడో బహుమతి..
దీంట్లో మూడో
బహుమతి కింది రూ.10,000 చెల్లిస్తారు. నేషనల్ లెవల్
ఇండస్ట్రియల్ సర్టిఫైడ్ ఏఐసీటీఎస్డీ సర్టిఫికేట్ను ఇస్తారు. రోబోటిక్స్లో ఆర్ అండ్
డీ, ఆటోమేషన్, సాఫ్ట్వేర్ రంగాల్లోని
నిపుణులతో 3 నెలల ఆన్లైన్ శిక్షణ(రూ.30వేలు
వెచ్చిస్తారు) ఇస్తారు. ఏఐసీటీఎస్డీ నిర్వహించే అంతర్జాతీయ పోటీలో పాల్గొనే అవకాశం
కల్పిస్తారు. దీంతోపాటు నేషనల్ మ్యాథమెటిక్స్ సైంటిస్ట్ స్కాలర్షిప్ను అందిస్తారు.
పరీక్ష విధానం
పరీక్ష ఆన్లైన్
విధానంలో నిర్వహిస్తారు. ఇంట్లో ఉండే ఆన్లైన్ పరీక్ష రాసే వెసులుబాటు ఉంది.
అభ్యర్థుల రిజిస్ట్రేషన్ సమయంలో అందించిన ఫోన్ నంబర్కి ఆన్లైన్ ఎగ్జామినేషన్
లింక్ను పంపిస్తారు. లింక్ ద్వారా అభ్యర్థులు ఆన్లైన్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది.
వయసును బట్టి గ్రూప్లను, గ్రూప్లను అనుసరించి పరీక్ష సిలబస్
నిర్దేశించారు. దరఖాస్తుకు పరిమితమైన సీట్లు మాత్రమే ఉంటాయి. 10
నుంచి 13 ఏళ్లు గ్రూప్-1, 14 నుంచి 17 ఏళ్లు గ్రూప్-2,18 నుంచి 24
ఏళ్లు గ్రూప్-3గా పేర్కొన్నారు.
సిలబస్: వెబ్సైట్
నుంచి సిలబస్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం:
ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు
పూర్తిచేయాలి. దరఖాస్తు ఫీజుగా రూ.260 చెల్లించాలి. దరఖాస్తు
వివరాలు, ఫీజు చెల్లించిన 48 గంటలలోపు
రిజిస్ట్రేషన్ కన్ఫర్మేషన్ లింక్ అభ్యర్థుల మెయిల్ ఐడీకి పంపిస్తారు.
ముఖ్యమైన సమాచారం
దరఖాస్తు చివరి
తేదీ : 30 ఏప్రిల్ 2020
ఆన్లైన్ టెస్ట్
తేదీ : 20 మే 2020
ఫలితాల వెల్లడి: 30
మే 2020
పూర్తి వివరాలకు
వెబ్సైట్:
You did not specify the correct age limit because...if a boy has 13 years and 8 months...what about his eligibility group
ReplyDelete