Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

CAPTURE THE DETAILS OF PRIVATE SCHOOL TEACHERS IN THE CSE WEBSITE


CAPTURE THE DETAILS OF PRIVATE SCHOOL TEACHERS IN THE CSE WEBSITE
ప్రైవేటు స్కూళ్ల వివరాలకు ప్రత్యేక పోర్టల్‌

School Education Department - Private Schools - Capture of details of teachers working in Private Educational Institutions through CSE website except Aadhar Details –Further instructions issued 
ప్రైవేటు విద్యా సంస్థలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని పాఠశాల విద్యాశాఖ సేకరిస్తోంది. ఇందుకు సంబంధించి ఇటీవలే ప్రత్యేకంగా ఒక పోర్టల్‌ను కూడా ఏర్పాటుచేసింది. ఇందులో ఆయా స్కూళ్లు తమ సంస్థల్లో పనిచేస్తున్న వారి సమాచారం మొత్తాన్ని అందించాలి. కొన్ని స్కూళ్లలో విద్యార్థుల ఫీజుల నుంచి టీచర్లకు ఇచ్చే జీతాలు, సదుపాయాల కల్పన ఇలా అన్నీ వాస్తవ విరుద్ధమైన రీతిలోనే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం.. పాఠశాల, ఉన్నత విద్యారంగాలు రెండింటినీ సమూలంగా ప్రక్షాళన చేసి ప్రమాణాలు పెంచే దిశగా అనేక చర్యలు చేపట్టింది.
* ఇందులో భాగంగా ఇప్పటికే ఈ రెండింటికీ హైకోర్టు మాజీ న్యాయమూర్తులు చైర్మన్లుగా చట్టబద్ధమైన కమిషన్లను ఏర్పాటుచేసింది.
* అంతేకాక.. పాఠశాల విద్యాశాఖ ఆయా స్కూళ్లలోని పరిస్థితులపై వాస్తవిక, సమగ్ర సమాచార సేకరణ లో భాగంగా ప్రైవేటు స్కూళ్ల టీచర్లకు సంబంధించి ప్రత్యేకంగా ప్రైవేటు టీచర్స్‌ పర్టిక్యులర్స్‌పేరుతో పాఠశాల విద్యాశాఖకు సంబంధించిన వెబ్‌సైట్లో కొన్ని వివరాలు అప్‌లోడ్‌ చేయిస్తోంది.
* ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాల వినతి మేరకు మే 31వ తేదీ గడువు పొడిగించి ఆ తేదీలోగా అందరూ తమ సంస్థల్లో పనిచేస్తున్న వారి సమాచారాన్ని పొందుపర్చాలని ఆదేశించింది.
ప్రైవేట్‌ స్కూళ్లు ఇవ్వాల్సిన వివరాలు
* జిల్లా కోడ్, స్కూల్‌ పేరు, జిల్లా పేరు, మండలం, గ్రామం, స్కూల్‌ కేటగిరి.
టీచర్లు ఇవ్వాల్సిన ప్రాథమిక సమాచారం
* టీచర్‌ పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, జెండర్, పాన్‌కార్డు నెం, ఆధార్‌ నెం, మొబైల్‌ నెం, కమ్యూనిటీ, నెల జీతం, నెలవారీ టాక్స్, బ్యాంక్‌ అకౌంట్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌.
* ఇక టీచర్ల అర్హతలకు సంబంధించి ఎస్సెస్సీ, ఇంటర్మీడియెట్, డిగ్రీ, పీజీ, బీఈడీ, డీఈడీ తదితరాలను పొందుపర్చాలి.
* ఆయా కోర్సులు పాసైన తేదీలు, వాటిని ఏ స్కూలు, కాలేజీ, యూనివర్సిటీ, సంస్థల్లో చదివారో కూడా స్పష్టంగా తెలియజేయాలి.

* వీటితో పాటు టీచర్లు ఎక్కడ నివసిస్తున్నారన్న అంశాలను పొందుపర్చాలి.
ALL THE HMs OF PRIVATE SCHOOLS IN THE STATE ARE INFORMED THAT A LINK HAS BEEN PROVIDED IN THE CSE WEBSITE TO CAPTURE THE DETAILS OF PRIVATE TEACHERS. 
*THE SCHOOL MANAGEMENT SHOULD SUBMIT ALL THE DETAILS AS MENTIONED IN THE LINK BY 05-05-2020 WITH OUT FAIL. 
*THE USERNAME / PASSWORD ARE SAME WHICH WERE GIVEN FOR AMMAVODI
LINK
MODEL FORMAT

Previous
Next Post »

1 comment

  1. Plz may I know for what purpose the collecting those details?

    ReplyDelete

Google Tags