లాక్‌డౌన్ పొడిగింపు కేంద్రం సంకేతాలు..!
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు
చేస్తున్న రెండో దశ లాక్‌డౌన్ మే 3వ తేదీన ముగియనుంది. కానీ, కరోనా పరిస్థితి ఇంకా
అదుపులోకి రాకపోగా, కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు నానాటికీ దేశవ్యాప్తంగా పెరుగుతుండడంతో లాక్‌డౌన్ పొడిగించక
తప్పదని కేంద్రం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, కరోనా వైరస్ తీవ్రత తక్కువగా ఉన్న జిల్లాల్లో చెప్పుకోదగ్గ మినహాయింపులు
ఇస్తారని సమాచారం. ఈ మేరకు కేంద్ర హోంశాఖ బుధవారం సంకేతాలు ఇచ్చింది.
పంజాబ్ లో లాక్‌డౌన్ పొడిగింపు
మే 3 తర్వాత లాక్‌డౌన్ ను మరో రెండు వారాల పాటు పొడిగిస్తూ
నిర్ణయం తీసుకుంటున్నట్లు పంజాబ్ సీఎం అమరిం దర్ సింగ్ బుధవారం ప్రకటించారు.
ఇందులో కొంత మేర సడలింపులు ఉన్నప్పటికీ, రెడ్ జోన్లలో సడలింపులు ఉండబోవన్నారు. మే 17 వరకు లాక్ డాన్ కొనసాగుతుందని
తెలిపారు.
కరోనాను అదుపులో ఉంచేందుకు మే చివరి వరకూ లాక్ డౌన్ విధించక
తప్పదని, ఈ విషయాన్ని పలువురు నిపుణులు,
వైద్యులు చెబుతున్నారని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ
తెలిపారు.
0 Komentar