Center to extend lockdown till MAY 3RD
మే 3 వరకు లాక్ డౌన్ ను
పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం...
మే 3వ తేది వరకు లాక్‌డౌన్‌ను
పొడిగిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. కరోనా విస్తరిస్తున్న
నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మరింత కఠినతరం చేయనున్నట్టు తెలిపారు. కరోనాపై పోరాటంలో
భారత్ ముందుకు వెళ్తుందన్నారు. దేశ ప్రజల త్యాగం వల్లే భారత్‌లో కరోనా నియంత్రణలో
ఉందన్నారు. ప్రజలు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ దేశాన్ని కాపాడుతున్నారని కొనియాడారు.
కొందరికి ఆకలి కష్టాలు ఉండొచ్చు, కొందరికి ప్రయాణాల కష్టాలు ఉండొచ్చు..
కానీ దేశం కోసం అన్ని సహిస్తున్నారని చెప్పారు.
కరోనా (కొవిడ్ -19) వైరస్‌పై విజయం సాధించడానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏడు సూత్రాలు
తెలియజేశారు. ఆ సూత్రాలివీ...
* భారతీయ యువ
శాస్త్రవేత్తలు కరోనాపై పోరులో ప్రపంచానికి చుక్కానిగా నిలవాలి.
* ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి భౌతిక దూరం, లాక్‌డౌన్, లక్ష్మణ రేఖ దాటొద్దు.
* రోగ నిరోధక శక్తి
పెంచుకునేందుకు అవసరమైన ఆహారం, వేడినీళ్లు తీసుకోవాలి.
* ప్రతి ఒక్కరూ ఆరోగ్య సేతు
యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని అన్ని విషయాలు తెలుసుకోవాలి.
* పేదలు, నిర్భాగ్యులు ఆకలితో అలమటించకుండా సమాజం ముందుకొచ్చి ఆదుకోవాలి.
* మీ పరిశ్రమల్లో ఎవరినీ
ఉద్యోగాల నుంచి తీసేయొద్దు.
* వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసులకు తగినంత గౌరవం ఇవ్వాలి.
0 Komentar