Computer Related Diseases & preventions
కంప్యూటర్ల వలన వచ్చే వ్యాధులు. నివారణ
నేడు కంప్యూటర్లు
మరియు తత్సంభదిత ఎలక్ట్రానిక్ పరికరల ప్రతి మనిషి జీవితం లో నిత్యవసర వస్తువులయి పోయాయి.
అవి లేనిదే రోజు ముందుకు నడవదు . దేనినైనా అతిగా వాడడం వలన దాని ప్రభావము మన
ఆరోగ్యము పై ఉంటుంది . మెదడుపైన , కళ్ళపైన , శరీర
కదలిక అవయవాలపైన చెడుపరిణామాలు కలుగుజేస్తుంది . రోజు రోజుకీ కంప్యూటర్ల వాడకం
ఎక్కువవుతోంది. దీంతో కొత్త జబ్బులూ పుట్టుకొస్తున్నాయి. ఆఫీసుల్లో గంటల తరబడికంప్యూటర్ల
ముందు కూచొని పనిచేసే ఉద్యోగుల్లో చాలామంది. కీళ్ల నొప్పులతో బాధపడుతున్నట్టు
బ్రిటన్ అధ్యయనంలో వెల్లడైంది. పరిశోధకులు ఈ సమస్యను 'ఆఫీస్
నీ' అని వర్ణిస్తున్నారు కూడా. ఊబకాయం , కదలకుండా కూచొని పనిచేయటం దీనికి దోహదం చేస్తున్నాయని వివరిస్తున్నారు.
ఇది అన్ని వయసుల వారిలో కనిపిస్తున్నప్పటికీ... 55 ఏళ్లు
పైబడినవారు మరింత ఎక్కువగా బాధపడుతున్నట్టు బయటపడింది. ఉబకాయులు సంఖ్య ఇలాగే
పెరుగుతూ పోతే మున్ముందు మోకాళ్ల మార్పిడి అవసరమూ గణనీయంగా ఎక్కువవుతుందని నిపుణులు
హెచ్చరిస్తున్నారు.
0 Komentar