లాక్‌డౌన్
ఎఫెక్ట్: కేంద్రం మరో కీలక నిర్ణయం
కేంద్ర ప్రభుత్వ
ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్‌నెస్ అలవెన్స్, డియర్‌నెస్ రిలీఫ్ పెంచరాదని నిర్ణయం తీసుకుంది. జనవరి ఒకటి నుంచి
పెండింగ్ ఉన్న మొత్తాన్ని కూడా చెల్లించరు. దీని ప్రకారం 2021 జులై వరకూ డిఏ, డీఆర్ పెరగదు.
దేశమంతా కరోనా
భయంతో విలవిల్లాడుతున్న తరుణంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వ
ఉద్యోగులకు భారీ షాకిచ్చారు. గతంలో ప్రకటించిన కరువు భత్యం (డీఏ)ను రద్దు చేశారు.
ఈ మేరకు ప్రధాని ఇచ్చిన ఆదేశాలతో కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ
ఉత్తర్వులు గురువారం మధ్యాహ్నం వెలువడ్డాయి.
కేంద్ర ప్రభుత్వ
ఉద్యోగులు, పెన్షనర్లకు గతంలో పెంచిన డీఏను నిలుపుదల చేస్తూ
ఉత్తర్వులు జారీ అయ్యాయి. జులై 2021 వరకు పెంచిన డీఏ పెంపు
నిలుపేశారు. 2020 జనవరి 1 నుంచి 2021
జూన్ 30 వరకు డీఏ బకాయిల చెల్లింపు కూడా
ఉండదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అప్పటి వరకు ప్రస్తుతం ఉన్న డీఏ మాత్రమే
కొనసాగుతుందని తెలిపారు
0 Komentar