Corona is not affected by 5G technology
5జీ సాంకేతిక పరిజ్ఞానం వల్ల కరోనా సోకదు
కరోనా వైరస్
ఒకరి నుంచి మరొకరికి సంక్రమించడంలో 5జీ సాంకేతిక పరిజ్ఞానం
సాయం చేస్తోందంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ఐక్యరాజ్యసమితి
కొట్టి పారేసింది. అయితే ఇటీవల 5జీ సాంకేతిక పరిజ్ఞానం వాడకం,
దీనికి సంబంధించిన తరంగాలతో మానవ వ్యాధి నిరోధక శక్తి
బలహీనపడుతోందంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్ అవుతున్నాయి. వైరస్
వ్యాప్తికి, 5జీ సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధం లేదని
ఐక్యరాజ్యసమితి సమాచార ప్రసార సాంకేతిక పరిజ్ఞాన విభాగం స్పష్టం చేశారు. దీనిపై
అంతర్జాతీయ టెలీకమ్యూనికేషన్స్ సంఘం అధికార ప్రతినిధి మోనికా గెహ్నర్ మాట్లాడుతూ,
వైరస్ రేడియో తరంగాల ద్వారా వ్యాపించదని, ప్రజా
ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన నెలకొన్న వాస్తవ పరిస్థితుల్లో ఇలాంటి ప్రచారం నిజంగా
సిగ్గుచేటు అని అన్నారు.
0 Komentar