Director of treasures and accounts clarifications regarding payment of Salaries etc...
ఉద్యోగుల జీతాల
వాయిదా మెమోలోని ముఖ్యాంశాలు
* చెక్‌ల రూపంలో
జీతాలు పొందే ఉద్యోగులకు పీడీ ఖాతాల ద్వారా వారికి జీతాలు అందుతాయి. వారికి సైతం
50శాతం వాయిదా వర్తిస్తుంది. వారు సగం మొత్తం జీతాలు డ్రా చేసుకుని మిగిలిన మొత్తం
ఆయా పీడీ ఖాతాల్లోనే ఉంచాల్సి ఉంటుంది. ఆ మొత్తాన్ని ఏం చేయాలనేది తర్వాత
నిర్దేశించనున్నారు.
*సస్పెన్షన్‌లో
ఉన్న వారికి 50% వాయిదా వర్తించబోవు. వారికి సగం జీతం మాత్రమే అందుతున్నందు వల్ల
వారికి ఈ ఉత్తర్వులు వర్తింపవు.
* డీడీఓలు జీతాల
బిల్లులు సమర్పించకపోతే 50శాతం బిల్లుల్లో కోత విధించి సమర్పించాలి.
* 2020 మార్చి
నెలాఖరున పదవీ విరమణ చేసిన వారికి సైతం ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి.
* ఇతర రాష్ట్రాల
వారు ఎవరైనా ఈ రాష్ట్రంలో పింఛను పొందితే ఈ ఉత్తర్వులు వర్తించబోవు.
* ఛార్జెడ్
మొత్తాల నుంచి జీతాలు చెల్లింపులు చేసే గవర్నర్, శాసనసభ స్పీకర్,
మండలి అధ్యక్షుడు, ఏపీపీఎస్సీ ఛైర్మన్,
న్యాయమూర్తులకు ఇది వర్తించబోదు. జిల్లాల్లో కోర్టుల సిబ్బందికి
వర్తిస్తాయి.
* గ్రామ
వాలంటీర్లు, వార్డు వాలంటీర్లు.. ఎవరైతే రూ.5000, రూ.4000 గౌరవవేతనం పొందుతున్నారో వారికి వాయిదా ఉండదు. ప్రభుత్వ
ఉత్తర్వులు వర్తించబోవు.
* పొరుగు సేవల
సిబ్బందికి కూడా 10శాతం మొత్తం చెల్లింపులు వాయిదా వేస్తారు.
0 Komentar