ధరిత్రి దినోత్సవం
భూగోళంపై కాలుష్య ప్రభావాన్ని తెలియజేయడం, ప్రజలలో అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నారు.
ధరిత్రీ దినోత్సవాన్ని నిర్వహించాలనే భావనను మొదటగా తీసుకొచ్చిన డేనిస్ హేస్ అనే
వ్యక్తి అమెరికాలో 1970లో
దీనిని నిర్వహించారు. అనంతరం ఇది ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెందింది. ఈ ధరిత్రీ
దినోత్సవాన్ని 192 దేశాలు అమలు
చేస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి 2009లో
ఈ ధరిత్రీ దినోత్సవానికి తన ఆమోదాన్ని తెలియజేసింది.
సమస్త జీవకోటి భారాన్ని మోసేది భూమి. ఈ విషయం అందరికీ తెలిసిందే. మరి
ఇలాంటి భూమి పరిరక్షణపై ఎంతమందికి అవగాహన ఉంది అంటే సమాధానం శూన్యం. పరిరక్షణ కోసం
ప్రత్యేకంగా చర్యలు తీసుకోకపోయినా పర్వాలేదు కనీసం హాని కలిగించ కుండా ఉంటే చాలు.
ఇందుకోసం అవగాహన అవసరం. అటు పర్యావరణం, వాతావరణం తో పాటు ఇటు జీవన శైలిలోనూ మార్పులతో భూ పరిరక్షణపై అవగాహన కోసం
కూడా ప్రత్యేక కార్యక్రమాలు అవసరమవుతున్నాయి.
ధరిత్రి దినోత్సవం రోజున మనం చేయగలిగిన పనులు
1) ఒక చెట్టు నాటడం.
2) మనం సొంత నీటి సీసాను, కిరాణా సంచిని మన వెంట
తీసుకునిపోవటం.
3) శాఖాహారిగా మారటం.
4) స్థానికంగా పెరిగే
కూరగాయలు కొనటం.
5) 'ముద్రణ' (ప్రింటింగ్) ని తగ్గించటం.
6) మోటారు వాహనాలకు
వాడకుండా నడవడం, సైకిల్ తొక్కడం.
7) డిస్పోజబుల్
ప్యాకేజీలకు దూరంగా ఉండండి
8) ప్రతి రోజునీ ధరిత్రి
దినోత్సవంగానే భావించి, పై వాటిని పాటించడం.
మన ఇంట్లో, చుట్టుపక్కల పరిసరాల్లో భూగోళ పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవడం ద్వారా
మానవాళి పురోగమన చర్యలకు తోడ్పడండి. ధరిత్రి పరిరక్షణకు స్ఫూర్తిని పెంచుకోండి.
'హ్యాపీ ఎర్త్ డే' - "రండి మన
భూమిని మనమే కాపాడుకుందాం"..!!
====================
ప్రకృతిని కాపాడితేనే మీరు సేఫ్..
ఈ సింపుల్ టిప్స్‌తో పర్యావరణాన్ని పరిరక్షిద్దాం.
====================
====================
0 Komentar