Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Education commissioner video conference highlights

తేది. 17-4-2020 న జరిగిన వీడియో కాన్ఫరెన్స్ నందు విద్యా శాఖ కమిషనర్ గారి సూచనలు

1. 10వ తరగతి విద్యార్థులకు దూరదర్శన్ సప్తగిరి ఛానల్ ద్వారా  TV లో ప్రసారం అవుతున్న "విద్యామృతం" కార్యక్రమం ఉదయం 10 నుంచి11 వరకు మరియు సాయంత్రం 4 నుండి 5 వరకు రోజూ 2 గంటలు విద్యార్థులకు పాఠాలు ప్రసారం అవుతున్నాయి. తల్లి దండ్రులు, విద్యార్థులు చూసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
2. అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్, డివిజన్ లెవల్ మానిటరింగ్ టీమ్ మెంబర్, క్లస్టర్ రిసోర్స్ పర్సన్ ప్రతిరోజూ 100 మంది విద్యార్థులకు ఒక వాట్సప్ గ్రూపు ఏర్పాటు చేసి ఎంత మంది విద్యార్థులు ప్రోగ్రామ్ చూసినది మానిటరింగ్ చేయాలని తెలియజేసిరి.
3. మధ్యాహ్న భోజన పధకం లో ఫేస్-1,ఫేస్-2 డ్రై రేషన్ పెండింగ్లో ఉన్నవి అన్ని పూర్తి చేయాలని, చిక్కీ, కోడిగుడ్లు తగినట్లయితే వెంటనే ఇండెంట్ పెట్టి సప్లైర్స్ నుంచి తెప్పించుకుని వెంటనే విద్యార్థులకు ఫీల్డ్ స్టాఫ్ ద్వారా సరఫరా చేయాలని తెలిపారు.
4. ఫేస్-3 లో హాస్టల్ విద్యార్థులకు డ్రై రేషన్  సరఫరా మొదలు పెట్టాలని తెలిపారు.
5. త్వరలోనే విద్యార్థులకు రేడియో పాఠాలు కూడా ప్రసారం అవుతాయని, ప్రసారాల షెడ్యూల్ విడుదల చేస్తామని చెప్పారు.
జిల్లా విద్యా శాఖాధికారి,

కృష్ణా జిల్లా.
అకడమిక్ మానిటరింగ్ విభాగంలో పనిచేస్తున్న ,DLMTs  మరియు  CRPs అందరికీ తెలియచేయడమేమనగా...
ఈరోజు జరిగిన వీడియో కాన్ఫరెన్స్ నందు గౌరవ కమీషనరు పాఠశాల విద్య మరియు రాష్ట్ర పథక సంచాలకులు, సమగ్ర శిక్ష, ఆంద్రప్రదేశ్ వారు లాక్డౌన్ కారణంగా  విద్యార్ధుల విలువైన సమయం నష్టపోకూడదని, 10 వ తరగతి విద్యార్ధులకు ఉద్దేశించిన విద్యామృతం (దూరదర్శన్ సప్తగిరి చానెల్ ద్వారా) తరగతులను పైతెలిపిన వారందరూ వీక్షించి, విద్యార్థులతో feedback తీసుకోవాలి అని ఆదేశాలు జారీ చేశారు. SCERT  వారు రూపొందించిన E-Content at your fingertips పై కూడా ఉపాధ్యాయులకు మరియు విద్యా ర్థులకు విస్తృతంగా ప్రచారం చేయడం, భోద్ శిక్షాలోకం యాప్ కూడా ప్రతి ఉపాధ్యాయుడు ఇన్స్టాల్ చేసుకునేలా పర్యవేక్షణ చేయాలని సూచించారు. పై చేపట్టిన కార్యక్రమాలను ప్రతి విద్యార్ధి సద్వినియోగం చేసుకునేలా అందరూ కృషి చేయాలి. విద్యార్ధుల నష్టపోకుండా ఇంకా ఎలాంటి సపోర్ట్  అందించగలం అనే అంశాల గురించి ఆలోచించాలి.
DLMTs, CRPs  క్రింది సమాచారాన్ని సేకరించాలి...
1) E-Content at your fingertips పై ఎంతమంది ఉపాధ్యాయులు, విద్యార్థులకు సమాచారం ఉంది. ఉపాధ్యాయులు మరియు విద్యార్ధుల అభిప్రాయాలు సేకరించాలి.
2) భోద్ శిక్షాలోకం యాప్ ఎంతమంది ఉపాధ్యాయులు వినియోగిస్తున్నారు?
ఉపాధ్యాయుల అభిప్రాయాలు సేకరించాలి.
3) విద్యామృతం కార్యక్రమం పై విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల అభిప్రాయాలు సేకరించాలి.
-DEO, PRAKASAM

Previous
Next Post »
0 Komentar

Google Tags