Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Employee Service Rules G.O.MS, G.O.RT Details

Employee Service Rules  G.O.MS, G.O.RT Details


ఉద్యోగుల సేవా నిబంధనలు జీవో యం ఎస్, జీవో ఆర్. టి  వివరాలు
జీవో యం ఎస్ అంటే ?
జీవో ఎంఎస్ (GO MS) అంటే గవర్నమెంట్ ఆర్డర్ మాన్యుస్క్రిప్ట్. ఇది శాశ్వత ఆర్డర్.
జీవో ఆర్. టి అంటే ?
జీవో ఆర్టీ (GORT)అంటే గవర్నమెంట్ ఆర్డర్ రొటీన్. దీన్ని ఐదేళ్లు భద్రపర్చాలి.
      భారత రాజ్యాంగంలోని 13(3)(ఏ) అధికరణం ప్రకారం, ఆర్డినెన్సు, ఆదేశం, బై-లా, నిబంధన, రెగులేషన్ ప్రకటన, ఆచారం, అలవాట్లు అన్నీ చట్టంగానే భావించబడతాయి. అన్ని చట్టసంబంధమైన విషయాలు, పార్లమెంటులో బిల్లురూపంలో ప్రవేశపెట్టబడతాయి.  చట్టం లేదా యాక్ట్ లో మూలసూత్రాలు మాత్రమే ఉంటాయి. ఆచరణ పద్ధతులు, పూర్తి వివరణలు నిబంధనల్లో ఉంటాయి.
     చట్టంలోని నియమాల ప్రకారం నిబంధనలు రూపొందించే అధికారం ప్రభుత్వానికి గానీ, లేదా మరో పరిపాలనా శాఖకు గాని ధారాదత్తం చేయబడుతుంది. దీన్నే డెలిగేషన్ ఆఫ్ పవర్ అంటారు. ఉదాహరణకు, సమాచారం కోరే వ్యక్తి రుసుము చెల్లించాలని చట్టం చెబితే, ఎంత చెల్లించాలనేది నిబంధనలు చెబుతాయి.నిబంధనలను చట్టసభల్లో ప్రవేశపెట్టాలి. రాజపత్రంలో ముద్రించాలి. ఆ ముద్రణ తేదీ నుంచే అవి అమల్లోకి వస్తాయి.
     చట్టబద్ధమైన కార్పొరేషన్లు చేసిన నిబంధనలు రెగులేషన్లు అని, పరిమిత ప్రాంతానికి, ప్రజలకు వర్తించే నిబంధనలను బై-లా అని పిలుస్తారు. ఇంకా ఆర్డర్లు, నోటిఫికేషన్లు, స్కీములు, సర్క్యులర్లు అనే పేర్లు కూడా వాడుతున్నారు. నిబంధనలన్నీ మూలచట్టం(యాక్ట్) లక్ష్యాలు, ప్రాథమిక సూత్రాలకు వ్యతిరేకంగా ఉంటే ఉన్నత న్యాయస్థానాలు పరిధి దాటడంగా భావించి రద్దు చేయవచ్చు. దీన్నే న్యాయసమీక్ష లేదా జుడిషియల్ రివ్యూ అంటారు. కేంద్ర చట్టాలన్న ఇండియాకోడ్  అనే వెబ్ సైట్ లో పొందుపర్చారు.
    కార్య నిర్వహక వ్యవస్థ లేదా శాసనసభ ఆమోదించిన చట్టాలను అమలు పరిచేందుకు, ప్రభుత్వ నిర్ణయాలు కార్యరూపం దాల్చేందుకు సర్కారు ఉత్తర్వులు జారీ చేస్తుంది. రాజ్యాంగానికి అనుగుణంగా చట్టాలు, చట్టాలకనుగుణంగా నిబంధనలు, నిబంధనలకనుగుణంగా ఉత్తర్వులు(జీవోలు), వాటికనుగుణంగా నిర్దేశాలు ఉండాలి.  ఈ జీవో, గజిట్ లను ప్రజాక్షేత్రంలో(ఇంటర్నెట్ ద్వారా) ఉచితంగా అందుబాటులో ఉంచిన ఘనత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కే దక్కుతుందని చెప్పాలి. ఐఏఎస్ శ్రీ సురేష్ చందా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్రటరీగా ఉన్నప్పుడు goir.ap.gov.in  అనే వెబ్ సైట్ ను సృష్టించారు. ఈ ప్రయత్నం చూసి కేంద్ర ప్రభుత్వం కూడా ఉచితంగా గజిట్ ను అందించాల్సి వచ్చింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags