కేరళలో ఉద్యోగుల
జీతానికి కోత
కరోనాపై పోరుకు నిధుల
లభ్యతను పెంచేందుకు కేరళ ప్రభుత్వం ఉద్యోగుల జీతాలపై కోత విధిస్తూ శుక్రవారం
ఉత్తర్వులు జారీ చేసింది. ఆరు రోజుల చొప్పున 5 నెలల పాటు ప్రభుత్వ ఉద్యోగుల
జీతానికి కోత పెడ తారు. నెల జీతం రూ. 20 వేలకు దిగువన ఉన్న ఉద్యోగులకు ఈ కోత
ఉండదని అందులో స్పష్టం చేశారు. ప్రభుత్వ, అనుబంధ రంగ సంస్థల్లో పని చేస్తున్న
ఉద్యోగులకూ ఇది వర్తిస్తుందని పేర్కొంది. పన్నుల రాబడి భారీగా గండిపడినందున,
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తిరిగి గాడిలో పెట్టేందువ ఈ చర్యలు
తీసుకున్నట్టు వివరించింది.
0 Komentar