కొత్త పన్ను విధానం కావాలా వద్దా
అన్న విషయాన్ని ఉద్యోగులు, తమ సంస్థల నిర్వాహకులకు
తెలియచేయాలని ఆదాయ పన్ను విభాగం పేర్కొంది. తద్వారా వేతనాల నుంచి టీడీఎస్
మినహాయించడానికి వీలు కల్పించాలని కోరుతోంది. ఉద్యోగులు తమ ఎంపికను కంపెనీలకు తెలియజేయాల్సి
ఉంటుందని ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సీబీడీటీ) ఒక సర్క్యులర్‌లో పేర్కొంది.
పాత పన్ను
విధానంలో...
రూ.2.5
లక్షల వరకు ఎటువంటి ఆదాయ పన్ను లేదు. రూ.2.5-5 లక్షలకు 5%;
రూ.5-10 లక్షలపై 20%; రూ.10 లక్షల పైన 30 శాతం పన్ను విధిస్తారు.
కొత్త పన్ను
విధానం(ఆప్షనల్) ప్రకారమైతే..
రూ.2.5-5 లక్షలపై 5%; రూ.5-7.5 లక్షలపై 10%;
రూ.7.5-10 లక్షలపై 15%; రూ.10-12.5
లక్షలపై 20%; రూ.12.5-15 లక్షలపై 25%; రూ.15 లక్షలపైన 30
శాతం పన్ను వర్తిస్తుంది. అయితే పన్ను మినహాయింపులను వదులుకోవాల్సి
ఉంటుంది.
DETAILED CIRCULAR
DOWNLOAD
DETAILED CIRCULAR
DOWNLOAD
0 Komentar