కేరళ జీతాల్లో
కోత విధించేందుకు ఆర్డినెన్స్ జారీ
ఉద్యోగుల జీతాల్లో ఆరు
రోజుల చొప్పున ఐదు నెలల పాటు కోత విధిస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో
ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలుచేస్తూ ఉద్యోగసంఘాలు పిటిషన్ దాఖలుచేశాయి. దీనిపై
వాదనలు విన్న కేరళ హైకోర్టు స్టే విధించింది. జీతాల కోతకు సంబంధించి అంటువ్యాధుల చట్టంలో కాని, విపత్తు నిర్వహణ చట్టంలో కానీ ఎలాంటి
చట్టబద్దమైన ఆధారం లేదని హైకోర్టు తేల్చిచెప్పింది. అయితే, అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసి ఉద్యోగుల జీతాల్లో
కోత విధించేందుకు ఆర్డినెన్స్ జారీ చేసింది. అంతేకాకుండా ఈ డెడక్షన్ డబ్బును ఒక నిర్దిష్ట కాల పరిమితి
అనంతరం తిరిగి చెల్లిస్తామని పేర్కొంది.
0 Komentar