LIC Premium Deadline Extension
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నెలకొన్న వేళ వినియోగదారుల కోసం
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
కీలక ప్రకటన చేసింది. మార్చి 2020, ఏప్రిల్ 2020లో చెల్లించాల్సిన ఎల్ఐసీ ప్రీమియం చెల్లింపుల కోసం 30 రోజుల
గడువును పొడిగించింది. సర్వీసు చార్జీలు లేకుండా ఆన్‌లైన్
ద్వారా కూడా చెల్లించవచ్చని పేర్కొంది. మొబైల్ యాప్ ఎల్‌ఐసీ పే డైరెక్ట్,
నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఫోన్ పే, పేటీఎం,
గూగుల్ పే, భీమ్, యూపీఐల
ద్వారా చెల్లించవ్చని తెలిపింది. ఐడీబీఐ, యాక్సిస్ బ్యాంకుల వద్ద, కామన్ సర్వీస్ సెంటర్స్ (సీఎస్సీ)ల ద్వారా ప్రీమియం చెల్లించవచ్చని
పేర్కొంది.
0 Komentar