Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Lockdown in Telangana state till 7th May

తెలంగాణ రాష్ట్రంలో మే 7 వరకు లాక్ డౌన్
రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను మే 7వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. అప్పటివరకు ఎలాంటి సడలింపులూ ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మే 3 వరకు ప్రకటిస్తూనే, 20 తర్వాత కొన్ని విషయాల్లో సడలింపులివ్వాలని మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే ఆదివారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత తెలంగాణలో ఎలాంటి సడలింపులు ఇవ్వకూడదని స్పష్టంగా నిర్ణయం తీసుకున్నాం. మంచీ చెడ్డ, రాష్ట్ర ప్రజల ఆరోగ్యం, వైరస్‌ వ్యాప్తి తదితరాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం అని సీఎం తెలిపారు.
Previous
Next Post »
0 Komentar

Google Tags