మధ్యాహ్న భోజనం
వంట ధరలు 10.99 శాతం పెంపు
ప్రభుత్వ
పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వంట ధరలను 10.99 శాతం పెంచుతూ కేంద్ర
ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త ధరలు ఈ ఏప్రిల్ 1వ
తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ఆయా రాష్ట్రాలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు
రాష్ట్ర ప్రభుత్వాలు జీఓ జారీ చేయాల్సి ఉంటుంది. మధ్యాహ్న భోజనం కోసం ప్రభుత్వం
పాఠశాలలకు బియ్యం సరఫరా చేస్తోంది. అన్నం, కూరలు, ఆయా సరకులు సమకూర్చుకోవడానికి రోజుకు ఇప్పటివరకు ఒక్కో విద్యార్థికి ప్రాథమిక
పాఠశాలల్లో రూ.4.48, ఉన్నత పాఠశాలల్లో రూ.6.71ల చొప్పున కేటాయిస్తూ వాటిని వంట కార్మికులకు ఇచ్చేవారు.ఏప్రిల్ 1 నుంచి ఈ మొత్తాన్ని వరుసగా రూ.4.97, రూ.7.45లుగా అందజేస్తారు. రాష్ట్రంలో
మొత్తం 23 లక్షల మంది విద్యార్థులు సర్కారు పాఠశాలల్లో
చదువుతుండగా సుమారు 52 వేల మంది కార్మికులు మధ్యాహ్న భోజనం
కోసం వంట చేస్తున్నారు.
0 Komentar