Permission to withdraw NPS
NPS ఉపసంహరణకు అనుమతి
కొవిడ్-19
చికిత్స ఖర్చుల కోసం జాతీయ పింఛను పథకం (ఎన్‌పీఎస్) నుంచి కొంత మొత్తం
ఉపసంహరించుకొనేందుకు అనుమతినిస్తున్నామని భారత భవిష్యనిధి నియంత్రణ, అభివృద్ధి సంస్థ (పీఎఫ్‌ఆర్‌డీఏ) తెలిపింది. ‘కొవిడ్-19 మహమ్మారి కాబట్టి ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ప్రాణాలు హరించే కొవిడ్-19ను అతి ప్రమాదకరమైన రుగ్మతగా గుర్తిస్తున్నాం’ అని
ప్రకటించింది.
జీవిత భాగస్వామి, పిల్లలు,
తల్లిదండ్రులు, చట్టబద్ధంగా దత్తత తీసుకున్న
పిల్లల చికిత్స కోసం చందాదారులు ఎన్‌పీఎస్ నుంచి కొంతమొత్తం ఉపసంహరించుకోవచ్చని
పీఎఫ్‌ఆర్‌డీఏ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అటల్ పెన్షన్ యోజన (ఏపీవై)
చందాదారులకు ఈ నిబంధన వర్తించదని స్పష్టం చేసింది. ఎన్‌పీఎస్, ఏపీవై పథకాలను పీఎఫ్‌ఆర్‌డీఏనే నిర్వహిస్తోంది. మార్చి 31 నాటికి ఈ రెండు పథకాల్లో 3.46 కోట్ల మంది ఉన్నారు.
0 Komentar