ఏపీలో ఇటీవల
నియమితులైన రెండున్నర లక్షల మంది గ్రామ, వార్డు వాలెంటీర్లకు ‘‘ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ’’ యోజన పథకాన్ని
వర్తింప చేసింది జగన్ ప్రభుత్వం. ఈ మేరకు ముఖ్యమంత్రి ఆదేశాలతో వైద్య, ఆరోగ్య శాఖ.. పంచాయితీ రాజ్ శాఖకు సర్క్యులర్ జారీ చేసింది.
దాంతో పీఎంజీకే
ప్యాకేజీ కింద 50 లక్షల రూపాయల బీమా వర్తిస్తుంది. రాష్ట్రంలో 2,60,000 మంది గ్రామ, వార్డు వాలంటీర్లకు ఈ బీమా
వర్తించనున్నది. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన మూడు విడతల కోవిడ్-19 ఇంటింటి సర్వేలో పాల్గొన్నా ఈ వాలంటీర్లు. వీరందరికీ కోవిడ్ థ్రెట్ వున్న
కారణంగా వారందరికీ బీమా వర్తింపచేయాలని ముఖ్యమంత్రి భావించారు. అందుకు అనుగుణంగా
సర్క్యులర్ మంగళవారం జారీ అయ్యింది.
0 Komentar