Stay alert with fake messages
ఫేక్ మెసేజ్ లతో అప్రమత్తంగా ఉండండి
ఇలాంటి మెసేజ్ ల
పట్ల అప్రమత్తంగా ఉండండి కరోనా నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితం కాగా.. సైబర్
నేరగాళ్లు కూడా ఇదే అదను చూసుకుని రెచ్చిపోతున్నారు. తాజాగా మీ PAYTM KYC సస్పెండ్ అయ్యిందని.. వెంటనే ఫలానా నెంబర్ కు ఫోన్ చేయాలని, లేకపోతే అకౌంట్ బ్లాక్ అవుతుందని కొందరు కేటుగాళ్లు కస్టమర్లకు మెసేజ్ లు
పంపుతున్నారు. దీనిపై స్పందించిన PAYTM.. 'ఇది FAKE అకౌంట్. ఇలాంటి మెసేజ్ ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
రుణాల మారటోరియం
మోసాలతో జాగ్రత్త
రుణాల నెలవారీ
వాయిదాల చెల్లింపుల (ఈఎంఐ)పై మారటోరియం అమలు నేపథ్యంలో మోసగాళ్ల బారిన పడకుండా
అప్రమత్తంగా ఉండాలని ఖాతాదారులను బ్యాంకులు హెచ్చరిస్తున్నాయి. ఈఎంఐ మారటోరియం
మోసాల గురించి అవగాహన పెంచుతున్నాయి. కీలకమైన ఓటీపీ, పిన్ నంబర్ల
వివరాలను ఎవరికీ ఇవ్వొద్దని సూచిస్తున్నాయి. ఖాతాల వివరాలను చోరీ చేసేందుకు సైబర్
క్రిమినల్స్, మోసగాళ్లు అనుసరిస్తున్న కొంగొత్త విధానాల
గురించి అవగాహన కల్పించే దిశగా యాక్సిస్ బ్యాంక్, స్టేట్
బ్యాంక్ ఆఫ్ ఇండియా తదితర బ్యాంకులు గత కొద్ది రోజులుగా ఖాతాదారులకు ఎస్‌ఎంఎస్‌లు,
ఈమెయిల్స్ పంపిస్తున్నాయి. ఈఎంఐల మారటోరియంపై సహకరిస్తామనే పేరుతో
మోసగాళ్లు .. ఓటీపీ, సీవీవీ, పాస్‌వర్డ్
లేదా పిన్ నంబర్ల వివరాలను ఇవ్వాలంటూ ఫోన్లు చేసే అవకాశాలు ఉన్నాయని బ్యాంకులు
తెలిపాయి. ఇలాంటి విషయాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. అటు కరోనా వైరస్
బాధితులకు తోడ్పాటు అందించేందుకు ఉద్దేశించి ప్రధాని ప్రారంభించిన పీఎం–కేర్స్ నిధికి చందాల సేకరణ పేరుతో కూడా మోసాలు జరుగుతున్నాయని, వీటి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నాయి.
0 Komentar