తేది. 22-04-2020 న సుప్రీంకోర్టు 5 గురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం,
ఏజన్సీ ఏరియాలో (షెడ్యూల్డ్ ఏరియాలో) 100% టీచర్
ఉద్యోగాలు ఏజన్సీ ఏరియా గిరిజనుల ద్వారా మాత్రమే నింపాలని చెబుతున్న GOMS
No. 3 of 2000 ను రాజ్యాంగ విరుద్ధం అని ప్రకటిస్తూ, ఆ జీవోను కొట్టి వేస్తూ, ఈ జీవో ద్వారా ఇప్పటికే
జరిగిన నియామకాలను కొనసాగించాలని, ఇక ముందు నియామకాలు మాత్రం
ఈ జీవో ద్వారా చేయవద్దని ఆదేశించింది. క్రింది జడ్జిమెంట్ ను పరిశీలించండి.
నేపధ్యం
ఉమ్మడి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1986లో షెడ్యూల్డు ఏరియాలో ఉపాధ్యాయ
నియామకాల్లో వంద శాతం గిరిజనులకు రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో నంబరు 275 జారీచేసింది. 1989లో ఏపీ పరిపాలనా ట్రిబ్యునల్
దాన్ని రద్దు చేసింది. దీనిపై ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వచ్చింది. సుప్రీం
కోర్టు 1998లో దానిని కొట్టివేస్తూ పిటిషన్‌ను
ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇచ్చింది. తిరిగి జనవరి 2000
సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం వంద శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో
ఇచ్చింది. పరిపాలన ట్రిబ్యునల్ దీనిని కొట్టివేయగా, హైకోర్టు
జీవోను సమర్థించింది. ఆ తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో ఈ పిటిషన్
దాఖలైంది. పిటిషనర్ తరపున న్యాయవాది సీఎల్‌ఎన్ మోహన్‌రావు వాదనలు వినిపించారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల తరపున న్యాయవాదులు తమ
వాదనలు వినిపింపచారు. వాటిపై ధర్మాసనం పైవిధంగా తీర్పునిచ్చింది.
జడ్జిమెంట్
0 Komentar