సెప్టెంబర్
నుంచి నూతన విద్యాసంవత్సరం, ఆన్‌లైన్ పరీక్షలు...?
కేంద్రానికి
యూజీసీ సిఫార్సు
ఈ ఏడాది అకడమిక్
ఇయర్ ను సెప్టెంబర్ నుంచి ప్రారంభించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ)
సూచించింది. కరోనా ఎఫెక్టును దృష్టిలో ఉంచుకుని యూనివర్సిటీలు, ఉన్నత
విద్యాసంస్థలు.. అకడమిక్ సెషన్ ను జూలైకి బదులుగా సెప్టెంబర్ నుంచి
ప్రారంభించవచ్చని యూజీసీ నియమించిన కమిటీ సిఫార్సు చేసింది.
సాధ్యమైతే ఆన్లైన్
పరీక్షలు
సెప్టెంబర్ నుంచి
విద్యాసంవత్సరాన్ని ప్రారంభించాలని ఒక కమిటీ సిఫార్సు చేయగా.. సదుపాయాలున్న
యూనివర్సిటీలు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించాలని మరో కమిటీ
రిపోర్టు సిఫార్సు చేసింది. లేదంలే లాక్డౌన్
ఎత్తివేసేంతవరకు వెయిట్ చేసి.. ఎప్పటిలానే పరీక్షలు నర్వహించేందుకు తేదీలను
నిర్ణయించాలని సూచించింది. ఈ రెండు రిపోర్టుల సిఫార్సులను స్టడీ చేసిన తర్వాత
వచ్చే వారం నాటికి అధికారికంగా మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు హ్యూమన్ రీసోర్స్
డెవలప్ మెంట్ అధికారులు ప్రకటించారు.
వృత్తివిద్యా
కోర్సులకు సంబంధించి ఇప్పటికే ఆన్ లైన్ ద్వారా తరగతులు నిర్వహిస్తున్నారు.
సీబీఎస్ఈ బోర్డు మాత్రం 29 సబ్జెక్టుల్లో మాత్రం విద్యార్థులకు పరీక్ష నిర్వహించి
ఉత్తీర్ణత సాధిస్తేనే తరువాతి తరగతికి ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉందని
పేర్కొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా విద్యా సంవత్సరం
మాత్రం జూన్ నుంచే ప్రారంభమయ్యే అవకాశం కనిపించట్లేదు.
0 Komentar