What Is
Helicopter Money & Quantitative Easing?
హెలికాప్టర్ మనీ
& క్వాంటిటేటివ్ ఈజింగ్ (క్యూఈ) అంటే ఏమిటి ?
ఆర్థిక
సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు హెలికాప్టర్ మనీ, క్వాంటిటేటివ్ ఈజింగ్
(క్యూఈ) విధానాలు అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీకి
ప్రతిపాదించారు. అసలేమిటి హెలికాప్టర్ మనీ, క్యూఈ? దీని వల్ల ఏం జరుగుతుంది?
అమెరికాకు చెందిన
ప్రఖ్యాత ఆర్థిక వేత్త ఫ్రెడ్‌మ్యాన్ 1969 హెలికాప్టర్ మనీ
విధానాన్ని ప్రతిపాదించారు. 2002లో ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్
బెన్ బెర్నాంకే దీన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు. ఈ విషయంలో మన దేశంలో ఆర్‌బీఐది
కీలక పాత్ర. దీని ప్రకారం నోట్ల ముద్రణ పెంచి ఆర్థిక వ్యవస్థలోకి పెద్దఎత్తున
నగదును చలామణీలోకి తీసుకురావడం దీని ముఖ్య ఉద్దేశం. ప్రజలకు నేరుగా డబ్బులు
చేరవేసి వారి కొనుగోలు శక్తిని పెంచడం దీని వెనుకున్న ఆంతర్యం. ప్రజల వద్ద డబ్బులు
లేక కొనుగులు శక్తి తగ్గిపోయిన నేపథ్యంలో డబ్బులను విరివిగా ఇవ్వడం ద్వారా డిమాండ్‌ను,
సప్లయ్‌ను పెంచడానికి ఈ విధానం దోహద పడుతుంది. క్వాంటిటేటివ్
ఈజింగ్ కూడా ఇలాంటిదే అయినా దీనికి ప్రభుత్వం వద్ద నుంచి ఆర్‌బీఐ బాండ్లు
కొనుగోలు చేస్తుంది. దీని కింద కూడా నోట్లను అధికంగా ముద్రించాల్సి ఉంటుంది. 2008లో సంభవించిన మాంద్యం
పరిస్థితులను ఎదుర్కొనేందుకు అమెరికా హెలికాప్టర్ మనీ విధానాన్ని అనుసరించింది. 2016లో జపాన్ సైతం హెలికాప్టర్ మనీ విధానాన్ని అవలంబించింది. ఒకవేళ నిత్యం
నోట్లను పెద్ద సంఖ్యలో ముద్రించి జనాలకు చేరవేస్తే కొన్నాళ్లకు దాని విలువ పడిపోయే
ప్రమాదం లేక పోలేదు...
హెలికాప్టర్ మనీ & క్వాంటిటేటివ్ ఈజింగ్ (క్యూఈ) అంటే ఏమిటి ? ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ గారి మాటల్లో...
హెలికాప్టర్ మనీ & క్వాంటిటేటివ్ ఈజింగ్ (క్యూఈ) అంటే ఏమిటి ? ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ గారి మాటల్లో...
0 Komentar