WhatsApp support
for eight participants in a video call
ఇప్పటివరకూ
నలుగురికే పరిమితమైన గ్రూపు వీడియోకాలింగ్ పరిమితి ఎనిమిది మందికి పెరగనున్నది...
ప్రముఖ సోషల్
మీడియా దిగ్గజం వాట్సాప్ ఇప్పటివరకు నలుగురికి మాత్రమే అవకాశం వున్న వీడియో కాలింగ్ పరిమితిని ఇపుడు ఎనిమిదికి పెంచింది. వాబేటా
ఇన్ఫో అందించిన సమాచారం ప్రకారం ఈ పెరిగిన
పరిమితి ఆండ్రాయిడ్ వాట్సాప్ వీ2.20.133 బీటా, ఐఫోన్
వాట్సాప్ వెర్షన్ 2.20.50.25 బీటాలో వినియోగదారులకు అందుబాటులోకి వస్తోంది. రెండు ప్లాట్‌ఫామ్‌లలోని
బీటా వినియోగదారులకు ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీనికోసం
అయితే యూజర్లు సరికొత్త బీటా వెర్షన్ కలిగి ఉండాలని వాట్సాప్ ఫీచర్స్
ట్రాకర్ తెలిపింది.
ఎలా
ఉపయోగించాలి..
వాట్సాప్‌లో
గ్రూప్ కాల్ చేయడానికి, కుడి
ఎగువన ఉన్న కాల్ బటన్ పై క్లిక్ చేయాలి. కాల్ అనంతరం యూజర్లను యాడ్ చేసుకోవాలి.
గ్రూప్ కి సంబంధించి అయితే ఎనిమిది మందికి
ఒకేసారి కాల్ చేసుకోవచ్చు. ఒకవేళ గ్రూపులో ఎనిమిదికంటే
ఎక్కువ వుంటే.. అపుడు ఎవరికి కాల్ చేయాలనుకుంటున్నారో వాట్సాప్ అడుగుతుంది. అలాగే కాంటాక్ట్ లో సేవ్ చేయని వారిని గ్రూపు కాల్ లోకి ఆహ్వానించలేం.
ఫోన్ స్విచ్చాఫ్
అయినా వాట్సాప్ వాడొచ్చు
ఫోన్ ఆన్లో ఉండటంతో
పాటు ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటేగానీ వాట్సాప్ ని వాడలేం. కానీ ఇక మీదట ఫోన్ స్విచ్చాఫ్
అయినా కూడా వాట్సాపన్ను వాడుకునే ఫీచర్ త్వరలోనే రాబోతోంది. దీని కోసం వాట్సాప్
మాతృసంస్థ యూనివర్సల్ విండోస్ ప్లాట్‌ఫాం (UWP) ని తయారు చేస్తోంది.
దీని వల్ల వాట్సాప్ వెబ్లో ఫోన్ లేకుండా వాట్సాప్ సేవల్ని వాడుకోవచ్చు. అయితే
ప్రస్తుతం ఈ ఫీచర్ ప్రయోగదశలో ఉండగా.. త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి రానుంది.
0 Komentar