టెన్త్
విద్యార్థులకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా పరీక్షలకు సన్నద్ధత
*ప్రభుత్వం టెన్త్
చదివే విద్యార్థుల సిలబస్ పునచ్చరణ కు వాట్సాప్ ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ను
వినియోగించుకుంటుంది. ఇందుకోసం పాఠశాలల్లో విద్యార్థులను వాట్సప్ గ్రూపులుగా
ఏర్పాటుచేశారు. ఈ గ్రూపులో ఆ స్కూల్లోని విద్యార్థులు, టీచర్లు
ఉంటారు. ముఖ్యమైన ప్రాక్టీస్ ప్రశ్నలను టీవీ లేదా రేడియోలో లెసన్స్ రూపంలో
చెబుతూ... అందుకు సంబంధించిన డేటాను వాట్సాప్ గ్రూపులో పంపనున్నట్లు తెలిసింది.
*ఎస్‌సీఈఆర్‌టీ నుంచి వచ్చే మోడల్ పేపర్‌ను ఆ సబ్జెక్టు చూసే టీచర్ వాట్సప్ గ్రూపులోని పిల్లలకు పంపిస్తారు.
*మరుసటి రోజు
దూరదర్శన్‌లో ఆ మోడల్ పేపర్లలోని ప్రశ్నలను నిపుణులతో చెప్పించడంతోపాటు ప్రశ్నలను
అర్థంచేసుకొని సమాధానాలు ఎలా రాయాలో నేర్పిస్తున్నారు.
* దూరదర్శన్
ఉదయం సెషన్లో ప్రశ్నలు చెప్పడంతో పాటు వాటికి పిల్లలతో హోమ్‌వర్కు చేయించడానికి
కొన్ని అంశాలను ఇస్తారు.
* మధ్యాహ్నం
రెండో సెషన్లో ఉదయం మోడల్ పేపర్లో ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు ఎలా రాశారు.
తప్పులు ఎక్కడ ఉన్నాయి. వాటిని ఎలా సరిచేసుకోవాలో రివ్యూ చేయిస్తారు.
*ఉదాహరణకు టీవీ లో
ఓ ప్రశ్న అడిగితే... ఆ ప్రశ్న... వాట్సాప్ గ్రూపులో విద్యార్థికి చేరుతుంది.
విద్యార్థులు దానికి సమాధానం రాసి... దాన్ని ఫొటో తీసి... గ్రూపులో పంపాల్సి
ఉంటుంది. ఆ ఫొటో డేటాను టీచర్లు పరిశీలించి... ఫీడ్‌బ్యాక్‌ను గ్రూపులో ఇస్తారు.
ఇలా విద్యార్థులు వాట్సాప్ గ్రూపును వాడుకొని టెన్త్ క్లాస్ చదువుకోవాలన్నమాట.
* టీచర్లకు
తల్లిదండ్రులకు కూడా ఈ కార్యక్రమం వల్ల కొంత బాధ్యత పెరుగుతుంది.
Sir exam rayaboyevara idi follow ivvalsindi..
ReplyDelete